Thursday, April 25, 2024
- Advertisement -

మొత్తం ఆ 11 రాష్ట్రాలకు బర్డ్​ ఫ్లూ విస్తరణ..!

- Advertisement -

దేశంలో 11 రాష్ట్రాలకు ‘బర్డ్​ ఫ్లూ’ విస్తరించినట్లు కేంద్రం వెల్లడించింది. తాజాగా ఛత్తీస్​గఢ్​లో ఇన్​ఫ్లూయెంజా వ్యాప్తి చెందినట్లు పేర్కొంది.ఛత్తీస్​గఢ్​లోని జీఎస్​ పౌల్ట్రీ ఫామ్​లో బర్డ్​ఫ్లూ విస్తరించినట్లు పరీక్షల్లో తేలిందని కేంద్ర పాడి పశు సంవర్థక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ రాష్ట్రానికి ముందు.. ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఉత్తర్​ప్రదేశ్, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, గుజరాత్​లలో బర్డ్ ​ఫ్లూ వ్యాప్తి ఖరారైనట్లు వెల్లడించింది.

మధ్యప్రదేశ్​లోని హర్దా, బర్హాన్​పుర్, రాజ్​గఢ్, దిందోరి, ఛింద్వాడా, మండ్ల, ధార్, సాగర్, సత్నా జిల్లాల్లోని నెమళ్లు, కాకుల్లో బర్డ్​ఫ్లూ విస్తరించినట్లు శుక్రవారం స్పష్టం చేసింది పశు సంవర్థక శాఖ. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు తక్షణమే తగిన చర్యలు తీసుకొని బర్ద్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా చూడాలని కేంద్రం కోరింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -