Friday, April 26, 2024
- Advertisement -

షాక్.. మనుషులకూ వ్యాపించిన బర్డ్ ఫ్లూ…!

- Advertisement -

ప్రపంచం ఎంతగా అభివృద్ది చెందుతున్న సమయంలో కొత్త కొత్త వైరస్ లతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. గత ఏడాది నుంచి కరోనా వైరస్ తో ప్రపంచం ఆర్థికంగా, ప్రాణ నష్టం తో విల విలలాడుతుంది. ఈ మద్య ఎబోలా వైరస్ కూడా భయాందోళన కలిగిస్తుంది. తాజాగా ఇప్పుడు పక్షులకే అనుకున్నా మనుషులను కూడా బర్డ్ ఫ్లూ వైర్ సోకింది. ఇప్పటి వరకు కోట్లాది పక్షులను బలిగొన్న బర్డ్ ఫ్లూ మొట్టమొదటి సారిగా మనుషులకు సోకింది.

ఈ విషయాన్ని అధికారికంగా నిర్దారించిన రష్యా శాస్త్రవేత్తలు, ఇన్ ఫ్లూయెంజా ఏ వైరస్ లోని హెచ్5ఎన్8 రకం తొలిసారిగా మానవునిలో కనిపించిందని, వెంటనే ఈ విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు తెలియజేశామని పేర్కొంది. రష్యా ఆరోగ్య నిఘా సంస్థ రోస్ పోర్టెబెన్జాడ్జోర్ ప్రతినిధి అన్నా పొపోవా  ఏడుగురు కార్మికులను వెక్టార్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఒకరిలో తీవ్రమైన హెచ్5ఎన్8 వైరస్ కనిపించిందని, ఇదే వైరస్ ను డిసెంబర్ లో పక్షుల్లో గుర్తించామని తెలిపారు.

రష్యా లాబొరేటరీ నుంచి తమకు సమాచారం అందిందని స్పష్టం చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, దీనిపై మరింత లోతుగా పరిశోధిస్తున్నామని పేర్కొంది. ఇది మానవుల నుంచి మానవులకు వ్యాపిస్తుందా? అన్న విషయమై ఇంకా స్పష్టత లేదని అన్నారు. కాకపోతే ఈ వైరస్ ఎక్కువగా పక్షులు, జంతువులతో కలిసి ఉండే వారికి వచ్చే ప్రమాదం ఉందని అంటున్నరు.  మానవులకు హెచ్5ఎన్1 ఇన్ ఫ్లూయెంజా వేరియంట్ వైరస్ సోకిన వేళ, తీవ్రమైన వ్యాధి లక్షణాలు కనిపించిన వారిలో 60 శాతం మంది మృత్యువాత పడిన విషయాన్ని గుర్తు చేసింది.

గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడుతున్నాయో? లేదో ? ఇలా తెలుసుకోండి !

సాయం కోరిన‌ స్టూడెంట్ తో ప్రొఫెస‌ర్ పాడు ప‌ని!

కేరళ పోలీస్‌ యాప్‌లో అల్లు అర్జున్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -