Thursday, May 2, 2024
- Advertisement -

జ‌మ్మూ, క‌శ్మీర్ సీఎం చేసిన వ్యాఖ్య‌ల‌ను త‌ప్పు ప‌ట్టిన భాజాపా…

- Advertisement -

రంజాన్‌, అమ‌ర్ నాథ్ యాత్ర సంద‌ర్భంగా కాల్పుల విర‌మ‌ణ పాటించాల‌ని జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్య‌లు తెలిసిందే. ఈ మేర‌కు కేంద్ర‌ప్ర‌భుత్వాన్ని కోరింది. అయితే సీఎం వ్యాఖ్య‌ల‌పై బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ స్పందించారు. ఆమె వ్యాఖ్య‌లు అర్త‌ర‌హితంగా ఉన్నాయ‌న్నారు.

కాల్పుల విరమణ’ అనే పదాన్ని ముఫ్తీ ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కశ్మీర్ లోయలో ఉగ్రవాదం నిలిచిపోతే భద్రతా దళాలు కూడా తమ చర్యలు ఆపివేస్తాయని, రంజాన్ సమయంలో టెర్రరిస్టులు తమ కార్యకలాపాలకు దూరంగా ఉంటే భద్రతా దళాల ఆపరేషన్లూ వాటంతటవే ఆగిపోతాయిని అన్నారు. కేంద్రం ‘కాల్పుల విరమణ’ను ప్రకటించడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదని కాదని ఆయ‌న అభిప్రాయపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -