Friday, March 29, 2024
- Advertisement -

సీబీఐ కోర్టుకు హాజ‌రుకానున్న జ‌గ‌న్‌…

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రారంభించిన పాద‌యాత్ర దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. ఆర‌వ తేదీన‌ మొద‌లు పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం క‌డ‌ప‌జిల్లాలో ని జ‌మ్మ‌ల‌మ‌డుగు నియేజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 125 నియేజ‌క వ‌ర్గాలు, మూడు వేల కి.మీ. మేర పాద‌యాత్ర చేప‌డుతున్నారు. అయితె తాజాగా జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు బ్రేక్ ప‌డింది.

ఆక్ర‌మాస్తుల కేసులో ఆరోప‌న‌లు ఎదుర్కొంటున్న జ‌గ‌న్ ప్ర‌తీ శుక్ర‌వారం సీబీఐ కోర్టుకు హాజ‌రు కావాల్సి ఉంది. పాయ‌దాత్ర‌కు మిన‌హాయింపు ఇవ్వాల‌ని జ‌గ‌న్ పెట్టుకున్న పిటిష‌న్‌ను కోర్టు తిర‌స్క‌రించింది. దీంతో విధిలేని ప‌రిస్థితుల్లో కోర్టుకు హాజ‌రు కావాల్సి ఉంటుంది. అందుకె ఈ రోజు రాత్రికి జ‌గ‌న్ హైద‌రాబాద్ రానుండ‌టంతో పాద‌యాత్ర‌కు భ్రేక్ ప‌డనుంది.

కోర్టుకు హాజ‌ర‌యిన అనంత‌రం పాద‌యాత్ర కొన‌సాగుతుంది.ఇలా వారానికొక‌సారి జ‌గ‌న్ త‌ను చేప‌డుతున్న పాద‌యాత్ర‌కు అంత‌రాయం ఏర్ప‌డుతుంది. ఇది జ‌గ‌న్‌కు ఇబ్బంది క‌లిగించే అంశం అయిన‌ప్ప‌టికి ఇంకో ప్ర‌త్యామ్నాయం లేదు. ఇలా పాద‌యాత్ర‌కు బ్రేక్ ఇవ్వ‌డం ద్వారా టీడీపీ నేత‌లు జ‌గ‌న్‌ను టార్గెట్ చేయ‌డం మాన‌రు. మ‌రి అధికార‌పార్టీ నాయ‌కుల విమ‌ర్శ‌ల‌కు వైసీపీ శ్రేణులు ఎలా చెక్ పెడ‌తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -