Saturday, April 27, 2024
- Advertisement -

తెలంగాణాతోపాటు నాలుగు రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్ ఇదే..

- Advertisement -

సెమీఫైన‌ల్‌గా భావిస్తున్న నాలుగు రాష్ట్రాల‌తో పాటు తెలంగాణాలో కూడా ఎన్నిక‌ల న‌గారా మోగింది. ఎన్నిక‌ల‌కు సంబంధించిన షెడ్యూల్‌ను సీఈసీ విడుదుల చేసింది.అటు జాతీయ రాజకీయాల పరంగా, ఇటు తెలంగాణ రాజకీయాల పరంగా తెలుగు వారిలో ఈ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయిఆసక్తిని రేపుతున్నాయి.

తెలంగాణలో డిసెంబరు 7న ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. డిసెంబరు 11న కౌంటింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. ఓటర్ల జాబితాపై హైకోర్టులో కేసు నడుస్తుండటంతో.. నవంబరు 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ నవంబరు 19 చివరి తేదీ కాగా.. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబరు 22. ఇక నవంబరు 28న నామినేషన్లను పరిశీలిస్తారు.

ఇక నాలుగు రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్ విషయానికి వస్తే… మధ్యప్రదేశ్, మిజోరం ఎన్నికలు నవంబర్ 28న జరుగుతాయి. ఛత్తీస్గడ్ ఎన్నికలు రెండు విడతలుగా జరుగుతాయి. నవంబర్ 12న ఒకటో విడత, నవంబర్ 20న రెండో విడత ఎన్నికలు జరుగునున్నాయి. రాజస్థాన్, తెలంగాణ ఎన్నికలు ఒకేరోజున జరగుబోతున్నాయి. డిసెంబర్ ఏడోతేదీన ఈ ఎన్నికలు జరుగుతాయి.డిసెంబర్ 11న మొత్తం ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల అవుతాయని సీఈసీ ప్రకటించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -