Thursday, May 9, 2024
- Advertisement -

పీఎంయూవై ప‌థ‌కం కింద పురుషుల‌కు ఉచితంగా గ్యాస్‌క‌నెక్స‌న్లు ఇవ్వ‌నున్న కేంద్రం

- Advertisement -

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకాన్ని మే 1, 2016న ప్రధాని నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్‌లో బాలియాలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా 3.31కోట్ల నిరుపేద (బీపిఎల్) కుటుంబాల్లోని మహిళలు లబ్ధి పొందారు. అయితే ఇప్పటివరకు ఈ పథకంలో మహిళను మాత్రమే అర్హురాలిగా గుర్తించినందున వారి పేరుతోనే గ్యాస్ కనెక్షన్ మంజూరు చేశారు.

అయితే, ఇకపై మహిళ లేని లేదా మహిళ అనారోగ్యంగా ఉన్న నిరుపేద కుటుంబంలోని పురుషుడి పేరుతో కూడా గ్యాస్ కనెక్షన్, సిలిండర్ అందజేయాలని కేంద్ర ప్రభుత్వం బావిస్తోంది. ఈ పథకంలో అర్హులై ఉండాలంటే సామాజిక-ఆర్థిక కుల గణనలో పేరు ఉన్నవారై ఉండాలి.

అందుకనుగుణంగా చమురు మంత్రిత్వ శాఖ సామాజిక-ఆర్థిక కుల గణన జాబితాలో వారి పేర్లను చేర్చనుంది. ప్రస్తుతం పీఎంయూవై పథకానికి రూ.4800 కోట్ల బడ్జెట్ ఉండగా దీనిని 8 వేల కోట్లకు పెంచాలని కేంద్ర కేబినెట్ ను కోరనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -