Wednesday, April 24, 2024
- Advertisement -

బాబు రాజ‌కీయానికి జూనియ‌ర్‌మ‌రో సారి బ‌లినా….?

- Advertisement -
Chandrababu Naidu offer TTD chairman post to Nandamuri Harikrishna
  • నంద‌మూరి,చంద్ర‌బాబు కుటుంబాల‌ను వెంక‌న్నే క‌లుపుతున్నాడా..?
  • అంత‌దూరం ఇప్పుడు ద‌గ్గ‌ర‌వుతోందా…?
  • టీటీడీ ప‌ద‌వితో నంద‌మూరి కుంటుంబాన్ని దువ్వుతున్న బాబు…
  • 2019 ఎన్నిక‌ల ఎన్నిక‌ల బాబు రాజ‌కీయ మార్క్‌

ఆంద్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్ర‌బాబానాయుడు మ‌రో సారి నంద‌మూరి వంశాన్ని దువ్వుతున్నారు.గ‌త ఐదు సంవ‌త్స‌రాలుగా నంద‌మూరి, చంద్ర‌బాబు కుటుంబాల మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే.

చంద్ర‌బాబు, బాల‌య్య‌కు అటు హ‌రికృష్ణ ఫ్యామిలీకు మ‌ధ్య అంత‌గా స‌ఖ్య‌త లేద‌న్న వార్త‌లు బ‌హిరంగ ర‌హ‌ష్య‌మే.అవ‌స‌ర‌మైప్పుడు రాజ‌కీయంగా వాడుకొని ప‌క్క‌న పెట్ట‌డం బాబు వెన్నుతో పెట్టిన విద్యేన‌ని చాలా సంద‌ర్భాల్లో బ‌య‌ట‌ప‌డింది.అయితే ఇప్పుడు మ‌రోసారి ఇరు కుంటుంబాలు ఒక్క‌ట‌వుతున్నాయ‌నే వార్త‌లు గ‌తంలో వినిపించాయి.

{loadmodule mod_custom,GA1}

2019 ఎన్నిక‌ల్లో టీడీపీకి అగ్నిప‌రీక్షేన‌ని చెప్ప‌డంలో సందేహంలేదు. ఏపీలో వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి రావ‌డం, తెలంగాణ‌లో స‌త్తా చాట‌డమే ధ్యేయంగా నంద‌మూరి ఫ్యామిలీ ఒక్క‌టైంది. తెలుగు ప్ర‌జ‌ల్లో నంద‌మూరి ఫ్యామిలీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వీరి మ‌ధ్య విబేధాల వ‌ల్ల నంద‌మూరి అభిమానులు, టీడీపీ కార్య‌క‌ర్త‌ల్లో చాలా క‌న్‌ఫ్యూజ‌న్ ఉంది.
2014 ఎన్నిక‌ల్లో భాజాపా- టీడీపీకి మ‌ద్ద‌తుగా ప‌వ‌ణ్ ప్ర‌చారం చేయ‌డంతో బాబు అధికారంలోకి వ‌చ్చారు.కొన్ని నెల‌ల త‌ర్వాత విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను విస్మ‌రించ‌డంతో ప‌వ‌ణ్ సొంతంగా జ‌న‌సేన పార్టీని స్తాపించారు.వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.దీంతో టీడీపీకి సినీ గ్లామ‌ర్ ప‌రంగా దెబ్బ‌ప‌డిన‌ట్లే.అందుకే జూ.ఎన్‌టీఆర్‌ను దువ్వుతున్నార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి.
బాల‌య్య – ఎన్టీఆర్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లే ఈ రెండు కుటుంబాల మ‌ధ్య బిగ్ గ్యాప్‌కు కార‌ణాల్లో ఒక‌టి. ఎన్టీఆర్ బాల‌య్య‌కు క్ష‌మాప‌ణ చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన‌వేవో జ‌రిగాయి…ఇక‌పై పొర‌పాట్లు జ‌ర‌గ‌వు..అంద‌రం క‌లిసిక‌ట్టుగా ఉందామ‌ని ఎన్టీఆర్ బాల‌య్య‌తో అన్న‌ట్టు కూడా తెలుస్తోంది.ఇక హ‌రికృష్ణ ఫ్యామిలీని చంద్ర‌బాబు ద‌గ్గ‌ర‌కు తీసుకోవ‌డం ఖ‌రారైన‌ట్టే. ఆయ‌న‌కు టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ఖ‌రార‌యిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

{loadmodule mod_custom,GA2}

ఇక యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌కు 2019లో తెలంగాణ‌లో ప్ర‌చార‌ప‌రంగా కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించేలా నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఏపీలోనూ ఎన్టీఆర్ ప్ర‌చారం చేసినా, తెలంగాణ‌లో రేవంత్‌రెడ్డితో కలిసి ప్ర‌చార‌ప‌రంగా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని బాబు ఎన్టీఆర్‌కు సూచించిగా అందుకు ఎన్టీఆర్ సుముఖ‌త వ్య‌క్తం చేశాడ‌ట‌. 2019లో జ‌న‌సేన పోటీ చేస్తుండ‌డంతో ప‌వ‌న్‌కు, ఇటు వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ధీటైన స్టార్ క్యాంపెయిన్‌గా ఎన్టీఆర్ అటు తెలంగాణ‌, ఇటు ఏపీల్లో కీల‌కంగా మార‌నున్నాడు. చంద్ర‌బాబు సంగ‌తి గురించి నంద‌మూరి ప్యామిలీకి బాగా తెలుసు.మ‌రి ఇందుకు జూనియ‌ర్ ఎన్టీఆర్ ఒప్పుకుంటాడో చూడాలి మ‌రి.

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}Un-1pnxVcK8{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -