Wednesday, May 8, 2024
- Advertisement -

హైద‌రాబాద్ కేంద్రంగా కుట్ర‌..? జ‌య‌రాం హ‌త్య‌కేసులో స్పీడు పెంచిన పోలీసులు

- Advertisement -

కోస్ట‌ల్ బ్యాంక్ ఛైర్మెన్ చిగురుపాటి జ‌య‌రాం కేసులో విచార‌ణ‌లో స్పీడు పెంచారు. ఆయ‌న‌ది ప్రాధ‌మికంగా హ‌త్య అని తేచ్చిన పోలీసులు ఆ దిశ‌గా విచార‌ణ‌ను లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నారు. జయరామ్‌ కారును వెంబడించిన మరో కారు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.రెండు రోజుల క్రితం హైద్రాబాద్‌ నుండి విజయవాడకు బయలుదేరిన ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మెన్ జయరామ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. విజయవాడకు సమీపంలోని కీసర వద్ద కారులో జయరామ్‌ మృతదేహం శుక్రవారం నాడు లభ్యమైంది.

హైదరాబాద్ కేంద్రంగానే జయరాం హత్య జ‌రిగింద‌నే .. విచారణలో భాగంగా జయరాం మేనకోడలు షికా చౌదరిని విచార‌ణ నిమిత్తం నందిగామకు తరలించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి జయరాం కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, కోస్టల్ బ్యాంకు సిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు

దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లో ఉంటున్న జయరాం మేనకోడలు మాధురి అలియాస్ శిఖా చౌదరిని పోలీసులు నందిగామకు తీసుకొస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ తేలిన విషయాలను బట్టి హైదరాబాద్ కేంద్రంగానే జయరాం హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

జయరామ్ కుటుంబసభ్యులు, కోస్టల్ బ్యాంకు సిబ్బందిని పోలీసులు ప్రశ్నించనున్నారు. మరో వైపు జయరామ్ కారు డ్రైవర్ ను పోలీసులు విచారించనున్నారు. ఇదిలా ఉంటే జయరామ్ మృతదేహం హైద్రాబాద్ కు తరలించారు. ఈ కేసును పోలీసులు ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. జయరామ్‌తో పాటు కారులో మరో ముగ్గురు వ్యక్తులు ప్రయాణించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -