హత్య చేసిన కోడి.. అరెస్ట్ చేసిన పోలీసులు..!

- Advertisement -

ఏదైనా నేరం జరిగినప్పుడు అందులో నిందితులను అరెస్ట్ చేయాల్సిందే. అందులోనూ ఓ వ్యక్తి మరణానికి కారణమైన వారు… ఎంతటి వారైనా అదుపులోకి తీసుకోవాల్సిందే. విచారణ చేసి నిజానిజాలు రాబట్టి… దోషులకు శిక్ష పడేలా చూసే బాధ్యత పోలీసులపై ఉంటుంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో మరణించిన ఓ వ్యక్తి విషయంలోనూ పోలీసులు తమ విధిని నిర్వర్తించారు. సదరు వ్యక్తి మృతికి ఓ కోడి కారణమని తేల్చిన పోలీసులు… హత్యా నేరం కింద అరెస్ట్​ చేశారు.

ఇటీవలే ప్రమాదవశాత్తు కోడి కత్తి మర్మాంగాలకు తగిలి ఓ వ్యక్తి మరణించిన ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో చోటు చేసుకుంది. లొత్తునూర్‌ శివారులో కోడి పందెం నిర్వహించడానికి స్థానికులు సిద్ధమయ్యారు. వెల్గటూరు మండలం కొండాపూర్‌కు చెందిన తనుగుల సతీశ్‌ (45) ఈ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా… కోడి కాలికి కత్తి కట్టేటప్పుడు అది తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆ కత్తి… సతీశ్​ పురుషాంగానికి, వృషణాలకు తగలగా అక్కడే కుప్పకూలాడు.

- Advertisement -

అక్కడున్న వారు వెంటనే స్పందించి క్షతగాత్రున్ని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా… మార్గ మధ్యలోనే సతీశ్​ మృతి చెందాడు. సతీశ్​కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేశారు. సతీశ్​ మరణించడానికి సదరు కోడి కారణమని తేల్చారు. కోడిని హత్యా నేరం కింద అరెస్ట్ చేశారు. పోలీస్​స్టేషన్​లోనే దాణా ఏర్పాటు చేసి జాగ్రత్తగా చూసుకుంటున్నారు.

షాదీ ముబారక్ అంటున్న దిల్ రాజు !

సోష‌ల్ మీడియాపై కేంద్రం చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్థించిన విజ‌య‌శాంతి

విష్ణుకి ‘మోసగాళ్ళు’ కలిసి వస్తుందా…!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -