పరారీలో ఇండియన్‌ స్టార్​ రెజ్లర్ సుశీల్ కుమార్.. కారణం అదేనా?

- Advertisement -

ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఢిల్లీలో దారుణం దారుణ హత్య జరిగింది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 24 ఏళ్ల రెజ్లర్‌ మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలంలో లభించిన ఐదు వాహనాలు, ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ గురిక్బాల్ సింగ్ సిద్ధూ పేర్కొన్నారు. అయితే బాధితుడి మృతిలో ఇండియన్‌ స్టార్​ రెజ్లర్ సుశీల్ కుమార్ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని మోడల్ టౌను ప్రాంతానికి చెందిన ఛత్రపాల్ స్టేడియం సమీపంలోని సుశీల్ కుమార్ ఇంట్లో సాగర్ మరియు అతని స్నేహితులు ఉంటున్నారు. వారిని ఖాళీ చేయమని సుశీల్ కుటుంబ సభ్యులు కోరారు. ఈ విషయంలో సుశీల్ కుటుంబ సభ్యులకు, రెంటుకు ఉంటున్న వారికీ మధ్య వాగ్వాదం జరిగింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఛత్రసల్ స్టేడియం సమీపంలో ఇద్దరు వ్యక్తులు తుపాకీతో ఇతరులపై కాల్పులు జరిపినట్లు పోలీస్‌ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది.

- Advertisement -

కాల్పుల విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిశీలించారు. దలాల్ (24) అనే యువకుడిని అరెస్ట్‌ చేసి.. పార్క్‌ చేసిన ఓ వాహనంలో బుల్లెట్లు లోడ్‌ చేసిన గన్‌ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాల్పుల ఘటనలో సుశీల్ కుమార్ హస్తం ఉందని పోలీసులు నిర్దారింఛి అతడిపై కేసు నమోదు చేశారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గురిక్బాల్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ.. సుశీల్ కుమార్ కోసం అతడి ఇంట్లో సోదాలు చేశామని, అక్కడ అతడు లేడని తెలిపారు. పోలీసులు బృందాలుగా విడిపోయి సుశీల్ కోసం గాలింపు చేస్తున్నట్లు తెలిపారు.

కరోనాతో ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత

కరోనా పై పోరాటం.. ఆర్ఆర్ఆర్ టీమ్ వినూత్న ప్రచారం!

కరోనా కాటుకు బాలీవుడ్ నటి బలి

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -
- Advertisement -