Saturday, April 27, 2024
- Advertisement -

ఎన్నికలకు… సీతాదేవికి లింకేంది బాబు…!

- Advertisement -
CM Chandrababu Naidu again Controversial Comments on Seetha Devi

ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు మ‌రోసారి వివాదాస్ప వ్యాఖ్య‌ల‌లో చిక్కున్నారు. ఇది ఇప్పుడు వైర‌ల్ గా మారుతోంది. గతంలో దళితులుగా పుట్టాలని ఎవరు మాత్రం కోరుకుంటారు?, కోడలు మగబిడ్డను కంటానంటే అత్త మాత్రం ఎందుకు వద్దంటుంది? అని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన.. తాజాగా మరోసారి నోరు జారారు.

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకే దేశం…ఒకే సారి ఎన్నికలు అనే ప్రతిపాదన తెచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ ప్రతిపాదన గురించి చంద్రబాబు ప్రస్తావిస్తూ.. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం స్వాగతిస్తానని అన్నారు. అయితే అదే సమయంలో నోరు జారారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి సీతాదేవి శీలాన్ని పరీక్షించిన మాదిరిగా ఏదో రాష్ట్రంలో ఎప్పుడూ ఏదో ఒక ఎన్నికలు నిర్వహించడం ఏంటంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికలకు సీతాదేవి శీలానికి ముడిపెడుతూ చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపేవిగా మారాయి. గతంలోను ఇలా వివాదస్పద వ్యాఖ్యల్లో ఇరుక్కుని ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. మురికివాడలో ఉన్న స్కూళ్లలో చదివితే మురికి ఆలోచనలే వస్తాయంటూ పేదలను అగౌరవపరిచేలా గతంలో వ్యాఖ్యలు చేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పంగా మారాయి. విపక్షాలు సహా ఆధ్యాత్మికవాదులు బాబు కామెంట్లపై మండిపడుతున్నారు.
ఇప్ప‌టికే లోకేష్ అనాలోచిన వ్యాఖ్య‌ల‌తో ప‌రువు పోగొట్టుకున్న బాబు ఇప్పుడు మ‌రో సారి స‌రిదిద్దుకోలేని విదంగా వ్యాఖ్య‌లు చేశారు.ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాలు,సోషియ‌ల్ మీడియా ఏవిధంగా అడ‌కుందో అందారికీ తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షం చంద్రబాబును టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదు. ఈ లెక్కన చంద్రబాబే స్వయంగా వివాదాలను కొని తెచ్చుకుంటున్నారని చెప్పక తప్పదు.మ‌రి ఈవ్యాఖ్య‌ల దుమారాం ఎంత వ‌ర‌కు పోతోందో చూడాలి.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. 2019 ఎన్నిక‌ల‌లో జ‌గ‌న్ బాహుబ‌లి.. లోకేష్ ఒక క‌మెడియ‌న్
  2. లోకేష్ నోటి నుంచి మరో అనిముత్యం..
  3. లోకేష్, జలీల్.. ఇద్దరూ ఇద్దరే..
  4. ఇక మార‌వ లోకేష్‌ నీకు దండంపెడ‌తర‌ కొడుకో

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -