Tuesday, May 7, 2024
- Advertisement -

శరీరాలు కాదు బుద్ధి పెరగాలి.. అచ్చెన్నాపై రెచ్చిపోయిన సీఎం జ‌న‌గ్

- Advertisement -

ఏపీ అసెంబ్లీలో సున్నా వడ్డీకే రుణాలపై చర్చ వాడీ-వేడిగా జరిగింది. సున్నా వడ్డీకి రుణాల విషయంలో టీడీపీ అబద్దాలు చెబుతోందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డు తగలడంతో సభలో అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. దీంతో టీడీపీ సభ్యులపై ముఖ్యమంత్రి జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

జ‌గ‌న్ వివ‌ర‌ణ ఇస్తున్న స‌మ‌యంలో టీడీపీ స‌భ్యులు ప‌దే ప‌దే అడ్డుత‌గులుతున్నారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. జగన్ ప్రసంగాన్ని ఆయన అడ్డుకోబోగా, “ముఖ్యమంత్రిగా ఇటువైపు నుంచి మా వర్షన్ మేము ఇస్తావుంటే… కనీసం వినాలన్న ధ్యాస కూడా లేకుండా మీరేం చేస్తావున్నారు? ఇదే మేము చేసివుంటే… మీ చంద్రబాబునాయుడు మాట్లాడివుండేవారా? మీరు మాట్లాడివుండేవారా?… ఏం…ఏం…ఏం ఏమయ్యా?… ఏమి? పర్చూరనుకున్నారా? శాసనసభ ఇది. ఎట్లాంటి వాళ్లను తయారు చేశారయ్యా మీరు… నాకు అర్థం కావడం లేదు. మొత్తం రౌడీలను, మొత్తం గూండాలను తయారు చేసుకుని వచ్చినారు” అంటూ వైఎస్ జగన్ వ్యంగ్యాస్త్రాలను సంధించారు.

టీడీపీ సభ్యులు కళ్లు పెద్దవి చేస్తే మేం భయపడాలా అంటూ జగన్ మండిపడ్డారు. కూర్చోవయ్యా.. కూర్చో అంటూ అచ్చెన్నాయుడిపై విరుచుకుపడ్డారు. సభలో 150మంది సభ్యలు ఉన్నారు.. తాము తలచుకుంటే టీడీపీ సభ్యులు వారి స్థానాల్లో కూర్చోలేరన్నారు. పర్సనాలిటీ పెరిగితే చాలదు.. బుద్ది పెరగాలని అచ్చెన్నాయుడుపై సీరియస్ కామెంట్స్ చేశారు. కూర్చోవయ్యా…. కూర్చోవయ్యా అంటూ అచ్చెన్నాయుడుపై జగన్ మండిపడ్డారు. అధికార, విపక్షాల మధ్య విమర్శల నేపథ్యంలో సభలో గందరగోళ పరిస్థితులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -