Monday, May 6, 2024
- Advertisement -

వైకాపాలోకి పురందేశ్వ‌రీనా..?

- Advertisement -
Daggubati Purandeswari likely join YSRCP..?

ఎన్నిల‌కు రెండు సంత్స‌రాలు ఉన్నా ముంద‌స్తు ఎన్నిక‌ల‌తో ఏపీ లో రాజ‌కీయ వాతావ‌ర‌నం వేడెక్కింది. పార్టీలో గౌర‌వం ద‌క్క‌నివారు,టికెట్టు ఆశించి భంగ‌ప‌డ్డ‌నాయ‌లు ఇత‌ర పార్టీల‌లోకి వ‌ల‌స‌లు వెల్ల‌డం సాధార‌నం. ఏపీలో కూడా వ‌ల‌స‌లు ప్రారంభ‌మ‌యిన‌ట్లు తెలుస్తోంది.

బీజేపీ సీనియ‌ర్ నేత ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి వైకాపాలో చేరుతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌లు సంచ‌ల‌నం క‌లిగిస్తున్నాయి. బీజేపీలో త‌గిన గైర‌వం ల‌భించ‌డంలేద‌ని గ‌తంలోనే పురందేశ్వ‌రి వ్యఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక పార్టీ పిరాయింపుల‌పై టీడీపీమీద  కేంద్రానికి ఏకంగా లెట‌ర్‌రాసి సంచ‌ల‌నం సృష్టించారు.అయితే ఇప్పుడు రాజ‌కీయ స‌మీక‌ర‌నాలు బేరీజు వేసుకొని వైకాపాలోకి వెల్లేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని తెలుస్తోంది.

ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా సిద్దంగా ఉన్నామ‌నే సంకేతాలు ఇప్ప‌టికే అన్ని పార్టీలు పంపాయి. కానీ ఇప్పుడు అంద‌రిచూపు విజ‌య‌వాడ నియేజ‌క‌వ‌ర్గంమీద‌నే ప‌డింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గ‌తంలో ల‌గ‌డ‌పాటి బాబును క‌ల‌వ‌డం, నానికి టికెట్టు ఇవ్వ‌క‌పోవ‌చ్చ‌ని వార్తులు చ‌క్క‌ర్లు కొట్టాయి. ఇప్ప‌టికే  నారా బ్రాహ్మిణి రాజ‌కీయాలు ఇష్టంలేవ‌ని చెప్ప‌డంతో దానికి పుల్‌స్టాప్ ప‌డింది. ఇదంతా చూస్తుంటే విజయవాడలో ఏం జరుగుతోంది అన్నది కాస్త ఆసక్తి కరంగానే వుంది. దీని వెనుక చంద్రబాబు చాణక్యం వుందనీ వినిపిస్తోంది.

 పురందేశ్వ‌రికి చెక్ పెట్టేందుకే ఇదంగా బాబు చాణ‌క్యం మొద‌లు పెట్టారని తెలుస్తోంది. గ‌తంలో కాంగ్రేస్‌ను వీడి బీజేపీలో చేరారు.

 గత ఎన్నికల సమయంలో కృష్ణా, గుంటూరు ప్రాంతాల నుంచి భాజపా టికెట్ పై పోటీ చేయాలని పురంధ్రీశ్వరి విశ్వ ప్రయత్నం చేసారు. కానీ వదినగారి ఫ్యామిలీ అంటే గిట్ట‌దు కనుక బాబు మోకాలు అడ్డం వేసారు. బాబును కాదని ఆంధ్ర భాజపా చేయగలిగింది లేదు కనుక, ఆమెను ఏకంగా సీమలోని రాజంపేటకు పంపారు. అక్కడ ఆమె ఓటమి చవి చూసారు.

ఇప్ప‌టికే భాజాపాలో  చేరిన పురందేశ్వ‌రికి స‌రైన ప్రాధాన్య‌త ఇవ్వ‌డంలేద‌ని  బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. పార్టీ పిరాయింపుల‌పై టీడీపీమీద కేంద్రానికి లేఖ రాయ‌డంతో బాబు కారాలు మిరియాలు నూరుతున్నారు. భాజపా టీడీపీతో పొత్తు లేకుండా ఒంట‌రిగా పోటీ చేస్తార‌ని కేంద్రంనుంచే ప్ర‌క‌ట‌న‌లు వ‌చ్చాయి. అయితే అవి ఇప్పుడు  ఎక్క‌డా క‌నిపిండంలేదు. బాబు-భాజపా పొత్తు వీడని బంధంలా వుండే అవకాశమే ఎక్కువగా వుంది. ఎందుకంటే మోడీని వీడి బాబు కోరి కష్టాలు కొని తెచ్చుకోరు. అందువల్ల ఈ నేపథ్యంలో  పురంధ్రీశ్వరికి మ‌ల్లీ ఈసారి ద‌క్ష‌ణ కోస్తానుంచి పోటీచేయాల‌ని ఆమె చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఎలాగైనా బాబు అడ్డుకుంటార‌నేది తెలిసందే.దీంతో ఇక మిగిలింది వైకాపా మాత్ర‌మే . అందుకే ఆపార్టీలోకి వెల్లేందుకు నిశ్చ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.

విజయవాడలో లగడపాటిని సీన్ లోకి తీసుకురావడం వెనుకకూడా బాబు రాజ‌కీయం కావ‌చ్చ‌నేది స‌మాచారం.  మరోపక్క బ్రాహ్మిణి పేరు తెర‌పైకి తెచ్చారు.కానీ బ్రాహ్మిణి తనకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదని ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. అయినా కూడా బ్రాహ్మిణి పేరు పదే పదే వినిపించడం వెనుక, పురంధ్రీశ్వరికి బ్రేక్ వేయడానికే బాబు ప్లానింగ్‌గా క‌నిపిస్తోంది.

ఇదిలా వుంటే భాజపాలో తన ఆశలు నెరవేరకుంటే, వైకాపాలో అడుగు పెట్టడానికి పురంధ్రీశ్వరి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ టికెట్ ఇస్తే వైకాపాలోకి వస్తానని ఆమె బేరం పెడుతున్నట్లు రాజకీయ వర్గాల బోగట్టా. అయితే ఇది జగన్ కు కాస్త ఇబ్బంది కర పరిణామమే. విజయవాడ వైకాపా టికెట్ ను ఆశించేవాళ్లు ఒకరిద్దరి కన్నా ఎక్కువే వున్నారు. అయినా పురంధ్రీశ్వరి కేవలం భాజపా-తేదేపాలపై వత్తిడి చేసేందుకే వైకాపాతో బేరం పెడుతున్నారా? లేక నిజంగా వైకాపాలోకి వెళ్లేందుకు ఆసక్తిగా వున్నారా? అన్నది క్లియర్ గా తెలియాల్సి వుంది. అయితే ఈ గ్యాసిప్ మాత్రం రాజకీయ వర్గాల్లో కాస్త గట్టిగానే వినిపిస్తోంది.

 పురందేశ్వ‌రికి ఎక్క‌డ టికెట్టు ఇవ్వాల్సి వ‌స్తుందోన‌ని  ముందుగానే  పసిగట్టిన బాబు పురంధ్రశ్వరికి అడ్డం కోవడం కోసం, ఆమె అవకాశాలకు ముందుగా దెబ్బ తీయడం కోసమే విజయవాడ సీటుపై ఈ ప్రచారం ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1.  వైసీపీ …టీడీపీ మ‌ధ్య సోషియ‌ల్ వార్
  2. టీడీపీకి మరో షాక్.. అనంతలో వైసీపీకి 2019లో విజయం ఖాయం..
  3. వైసీపీ ఎమ్మెల్యేకు పవన్ అంటే పడిచచ్చే అభిమానమట
  4. చిత్తూరు జిల్లాలో టీడీపీకీ మ‌రోషాక్‌… వైసీపీ వైపు ఎంపీ శివ‌ప్ర‌సాద్ చూపు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -