- Advertisement -

బీజేపీ లో రచ్చ రచ్చ .. కొట్టుకు ఛస్తున్నారు

- Advertisement -

ఏపీ లో చాన్నాళ్ళ ఎదురు చూపుల తరవాత నామినేటెడ్ పదవుల జాతర మొదలైంది. టీడీపీ లో ఈ పరిణామం సంతోషాలు కలిగిస్తూ ఉన్నా కూడా బీజేపీ లో మాత్రం తీవ్రమైన అలజడి కి కారణం అవుతోంది. క్రమశిక్షణ కి మారుపేరు అయిన ఈ పార్టీలో గందరగోళం ఏర్పడింది. చివరికి పార్టీ నాయకత్వాన్ని సైతం ధిక్కరించే దిశగా అడుగులు పడుతున్నయి అంటున్నారు విశ్లేషకులు. రెండు రోజుల కిందట వరకూ పదవుల విషయం లో రేగిన గొడవ నేపధ్యం లో విజయవాడ బీజేపీ కార్యాలయం మీదనే కార్యకర్తలు దాడి చేసేసారు.

ఈ దాడి వెనక ఆ పార్టీ నగర అధ్యక్షుడు డాక్టర్ దాసం ఉమామహేశ్వరరాజు పాత్ర ఉందని గుర్తించిన రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు దాసంను సస్పెండ్ చేశారు. అయితే.. దాసం ఏమాత్రం తగ్గకుండా వెంటనే పార్టీ కార్యాలయంలోనే వివిధ డివిజన్ ల అధ్యక్షులు – పలువురు ఇతర నేతలతో సమావేశమయ్యారు. సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ దాసంనే అధ్యక్షునిగా కొనసాగింపజేస్తూ ఆ సమావేశంలో తీర్మానం చేశారు.

అంతేకాదు… ఆ తీర్మానాలను పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు పంపించాలని కూడా నిర్ణయించారు. ఇదంతా ఒకెత్తయితే.. సమావేశం సందర్భంగా సస్పెండయిన నేత దాసం మాట్లాడుతూ… తనను సస్పెండ్ చేసే అధికారం రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటికి లేదని కుండ బద్ధలు కొట్టేశారు. అందుకు లాజిక్ కూడా ఆయన చెప్పుకొచ్చారు. కంభంపాటి పదవీకాలం ముగిసిందని.. ఎన్నికలు జరిపించకుండా అడ్డగోలుగా కొనసాగుతున్నారని ధ్వజమెత్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -