Tuesday, April 23, 2024
- Advertisement -

జీఎస్టీ ఎగ్గొడితే జైలుకే: జీఎస్టీ, ప‌న్ను క‌ట్ట‌లేద‌ని వ్యాపార‌వేత్త‌ అరెస్ట్‌

- Advertisement -

ఒక‌ప్పుడు ప‌న్నుకు కాదేది అన‌ర్హం అంటూ ప్ర‌తి దానికి ప‌న్ను లేని వ‌స్తువు ఏది లేదు.. ప్ర‌తి ప‌నికి ప‌న్ను క‌డుతూ ప్ర‌జ‌లు స‌త‌మ‌త‌మ‌య్యారు. ఇప్పుడు ప్ర‌స్తుతం అన్నీ ప‌న్నుల‌ను కలిపి ఎన్డీఏ ప్ర‌భుత్వం గుడ్ స‌ర్వీస్ టాక్స్ (జీఎస్టీ) అంటూ ప‌న్ను సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చారు. అప్ప‌టి నుంచి ప‌న్నుపోటు ప్ర‌జ‌ల భారంపై తీవ్రంగా ప‌డింది. ఇప్పుడు ఆ ప‌న్ను భారం భ‌రించ‌లేక దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు అల్లాడుతున్నారు. వ్యాపారాలు మూత ప‌డుతున్నాయి. జీఎస్టీ తెచ్చింది సామాన్యుల కోసం కాదు బ‌డా పారిశ్రామిక వేత్త‌ల కోసం అనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే ఇప్పుడు జీఎస్టీ, సేవా ప‌న్ను క‌ట్ట‌లేద‌ని ఓ వ్యాపార‌వేత్త‌ను పోలీసులు అరెస్టు చేసిన సంఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని ముంబైలో చోటుచేసుకుంది.

జీఎస్టీతో పాటు సేవా ప‌న్నును ఎగవేసిన వారిపై కేంద్ర ప్ర‌భుత్వం క‌ఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు తాజాగా ఆన్‌లైన్ షాపింగ్ నిర్వహిస్తున్న ‘‘గ్యాడ్జెట్స్ గురు’’ అనే వెబ్‌సైట్ డైరెక్టర్ రాజ్‌పాల్ సింగ్‌ను కేంద్ర సంస్థ‌కు చెందిన అధికారులు అరెస్టు చేశారు. నవీ ముంబైలో ఉన్న గ్యాడ్జెట్స్ గురు కార్యాల‌యాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఆ ఆన్‌లైన్ షాపింగ్ సైట్ మొత్తం రూ.8 కోట్ల మేరకు జీఎస్టీ ఎగవేసిందని అధికారులు గుర్తించి చ‌ర్య‌లు తీసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -