Friday, May 24, 2024
- Advertisement -

ఆ ఇద్దరూ కలిసి పోటీ చేస్తే!

- Advertisement -

తమిళనాడు రాజకీయాల్లో కొత్త పొత్తులు ఉదయిస్తున్నాయి. అధికార పార్టీ అన్నాడీఎంకే.. సొంతంగా పోటీ చేయడం ఖాయమైంది. కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే మాత్రం.. కెప్టెన్ విజయ్ కాంత్ తో పొత్తు కోసం ఎదురు చూసి ఇప్పుడు డీలా పడింది. మరోవైపు.. బీజేపీ కూడా విజయ్ కాంత్ తో దోస్తీ కోసం ట్రై చేసి ఫెయిలైంది.

ఆఖరికి పీపుల్స్ వెల్ ఫేర్ ఫ్రంట్ తో కలిసి.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దూకాలని కెప్టెన్ నిర్ణయించుకోవడం సంచలనంగా మారింది. ఈ నిర్ణయం.. డీఎంకే, బీజేపీలకు షాక్ ఇచ్చింది. కెప్టెన్ విజయ్ కాంత్ కూటమిగా.. బరిలోకి దిగుతున్నట్టు.. పీపుల్స్ వెల్ ఫేర్ ఫ్రంట్ నాయకుడు వైగో కూడా కన్ఫమ్ చేయడంతో.. తమిళ రాజకీయాల్లో పొత్తులు లేకుండా మిగిలింది డీఎంకే, బీజేపీనే అని తేలిపోయింది.

ఎలాగూ కేంద్రంలో అధికారంలో ఉంది… ఇటు రాష్ట్రంలో డీఎంకే గతంలో అధికారంలో ఉంది.. ఇప్పుడు రెండు పార్టీలు కలిసి పని చేస్తే.. ఎంతో కొంత లాభం ఉంటుందన్నది.. అరవ రాజకీయాల్లో కొందరి అభిప్రాయం. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను అంచనా వేస్తున్న డీఎంకే, బీజేపీలు.. త్వరలోనే పొత్తుపై ఓ అంగీకారానికి వచ్చే అవకాశాలున్నాయని అంతా అనుకుంటున్నారు.

ఒంటరిగా పోటీ చేసి ఓట్లు చీల్చడం కంటే.. కలిసి ఓట్లు పంచుకుని కనీసం రాజకీయాలపై పట్టు సాధించాలన్నది బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది. మరోవైపు.. ఏ తోడూ లేకుండా ఎన్నికల్లోకి వెళ్తే.. గెలుపు అవకాశాలు తక్కువే అని డీఎంకే లెక్కలేస్తోంది. ఇదే.. ఇద్దరూ కలిసి నడుస్తారన్న ఊహాగానాలకు కారణమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -