Friday, May 3, 2024
- Advertisement -

మొగిన గుజరాత్ ఎన్నికల నగారా..సిద్దమైన పార్టీలు !

- Advertisement -

దేశ వ్యాప్తంగా గత కొన్నాళ్లుగా గుజరాత్ కు సంబంధించిన ఎన్నికలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మొత్తం 182 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. మొదటి విడతలో 89 అసెంబ్లీ స్థానాలకు గాను డిసెంబర్ 1 పోలింగ్ జరగనుండగా, రెండవ విడతలో 93 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజున ఫలితాలు విడుదల కానున్నాయి. ఈసారి గుజరాత్ ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎన్నికల బరిలో దిగనుంది. ఇక అలాగే కే‌సి‌ఆర్ జాతీయ పార్టీ అయిన బి‌ఆర్‌ఎస్ కూడా గుజరాత్ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నప్పటికి ఇంకా ఎలాంటి స్పష్టత లేదు.

గత 25 ఏళ్లుగా గుజరాత్ లో బీజేపీ ఏకచక్రధిపత్యం వహిస్తోంది. అయితే ఈసారి మాత్రం బీజేపీకి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను విపక్ష పార్టీలు ఎత్తిచూపే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నాయి. కాంగ్రెస్ మరియు ఆమ్ ఆద్మీ పార్టీలు మోడి పాలనపై చేస్తున్న విమర్శలు ఎంతో కొంత ప్రభావం చూపి అవకాశం ఉంది. ఇక మెల్లమెల్లగా జాతీయ పార్టీగా విస్తరిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి గుజరాత్ పై గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పంజాబ్ లో బీజేపీకి షాక్ ఇచ్చిన కేజ్రివాల్ అదేవిధంగా గుజరాత్ లో కూడా బీజేపీకి షాక్ ఇవ్వాలని గట్టి పట్టుదలగా ఉన్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా పూర్వ వైభవం కోసం గుజరాత్ లో సత్తా చాటెందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇక కే‌సి‌ఆర్ కూడా గుజరాత్ ఎన్నికల బరిలో దిగితే దేశవ్యాప్తంగా గుజరాత్ ఎన్నికలు చర్చనీయాంశం కావడం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -