Thursday, May 2, 2024
- Advertisement -

వాహ‌న‌దారుల‌కు కేంద్రం సుభ‌వార్త‌….పెట్రోల్, డీజిల్ పై ధరల తగ్గింపు

- Advertisement -

గ‌త నెల రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. అక్కడక్కడా రూ.90 మార్క్‌ను కూడా దాటాయి. దీంతో వాహ‌న‌దారులు బెంబేలెత్తిపోయారు. తాజాగా కేంద్రం వాహ‌న‌దారుల‌కు ఊర‌ట‌ను క‌లిగించే నిర్ణ‌యం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్ పై రూ.2.50 తగ్గిస్తూ గురువారం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. త‌గ్గించిన ధ‌ర‌లు వెంట‌నే అమ‌లు లోకి వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించారు.

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయని, ద్రవ్యలోటు తగ్గించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.పెట్రో ఉత్పత్తులపై ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ.1.50 చొప్పన.. ఆయిల్ కంపెనీలు మరో రూపాయిని భరిస్తున్నట్లు జైట్లీ చెప్పారు. ఈ తగ్గింపుతో మొత్తం లీటర్‌కు రూ.2.50 తగ్గుతోందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే చేయాలంటూ త్వరలోనే లేఖలు రాస్తామన్నారు ఆర్థిక మంత్రి. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో కేంద్రం రూ.10500 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోతుంద‌న్నారు. అమెరికాలో వ‌డ్డీ రేట్లు ఎక్కువ‌గా ఉండ‌టం.. రూపాయి బ‌ల‌హీన ప‌డ‌టం భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం చూపింద‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -