Sunday, May 5, 2024
- Advertisement -

దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన బంగారం!

- Advertisement -

కరోనా నేపథ్యంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకిన సంగతి తెలిసిందే. మాములు ప్రజలైతే బంగారం అంటేనే భయపడేలా బంగారం రేట్లు పెరిగిపోయాయి. దేశ రాజధానిలో పది గ్రాముల పసిడి ధర రూ.791 పెరిగి రూ.51,717కు చేరింది. నిన్నటి ట్రేడింగ్‌లో రూ.50,926 వద్ద ముగిసింది. ఇక వెండి సైతం దిల్లీలో కేజీ రూ.2,147 పెరిగింది. దీంతో కేజీ వెండి రూ.64,578కి చేరింది. గత మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.  

అమెరికా ఎన్నికల్లో జో బైడెన్‌ గెలుపు దాదాపు ఖరారైన నేపథ్యంలో త్వరలోనే మరో ఉద్దీపన ప్యాకేజీ వస్తుందని విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు. అదే జరిగితే ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు, డాలరు విలువ క్షీణించే అవకాశం ఉండడంతో మదుపరులు పెట్టుబడికి బంగారంవైపు మొగ్గు చూపుతున్నారు.

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు హెచ్చుతగ్గులు అవుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా నియంత్రణకు మరోసారి లాక్‌డౌన్‌లు విధిస్తుండడంతో మార్కెట్లలో పెట్టుబడి అంత సురక్షితం కాదని భావిస్తుండడం బంగారానికి డిమాండ్‌ ఏర్పడింది.

విశాఖ లో అమాంతం పెరిగిన భూముల ధరలు..?

యాడ్స్ లో నటిస్తే మన హీరోయిన్స్ రెమ్యునరేషన్ ఎంతంటే ?

సంగీత దర్శకుల రెమ్యునరేషన్స్ ఇలా ఉంటాయి..!

‘బిగ్ బాస్4’ ఇంటి సభ్యుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -