Monday, April 29, 2024
- Advertisement -

గోంగూర చట్నీ..ఉపయోగాలు తెలుసా?

- Advertisement -

ఆకుకూరల్లో గోంగూరలో ఉండే ప్రయోజనాలెన్నో. అందుకే గోంగూర అంటే ఇష్టపడనివారుండరు. దీనికి ఆంధ్రామాత అని పేరు కూడా ఉండగా గోగుపూలు అందంగా ఉంటాయి..అందుకే అస్తమించే సూర్యుడు గోగుపూల ఛాయలో ఉంటాడని కవులు వర్ణించారు. ఇక గోంగూర ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదలరు.

గోంగూరలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్ మరియు ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తి స్థాయిలను పెంచుతాయి. బరువు తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో సి విటమిన్ ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్‌ను నిరోధించడంలో మరియు ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడుంది.

గోంగూరలోని పోషకాలు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు,మధుమేహాన్ని నివారించడంలో సహాయపడతాయి. గోంగూర, వెల్లుల్లి కలిపి చట్నీ చేస్తే అమృతమే. టెస్ట్‌కు టెస్ట్‌తో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. గోంగూర- వెల్లుల్లి కాంబినేషన్‌తో అల్జీమర్స్ వ్యాధి తగ్గించడంలో సహాయపడతాయి.అలాగే రక్తంలో చక్కెర మరియు రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఐరన్ కంటెంట్‌తో పాటు ప్రోటీన్ మరియు ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఓ సారి మీరు గోంగూర చట్నిని ట్రై చేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -