Thursday, May 2, 2024
- Advertisement -

నెక్సెస్ ఫోన్లకు మరిన్ని ఫీచర్లు – పిచాయ్

- Advertisement -

తమ కంపెనీ నెక్సెస్ స్టార్ట్ ఫోన్లను తయారు చేసే యోచనలో లేమని గూగుల్ సిఇవో గూగుల్ సిఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. కొన్నాళ్ల పాటు ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మ్యాన్ ఫ్యక్చరర్ తోనే (ఒఇఎం) కలిసి పనిచేస్తామని ఆయన అన్నారు. ఒఇఎంతో కలిసి మరిన్ని కొత్త వాటిని ఉత్పత్తి చేస్తామని, అయితే అందులో స్మర్ట్ ఫోన్లు మాత్రం ఉండవని ఆయన అన్నారు.

నెక్సెస్ ఫ్లోన్లలో ఉన్న ఆండ్రాయిడ్ కు ఆలోచనాత్మకంగా మరిన్ని ఫీచర్లు జత చేయాలనుకుంటున్నామని పిచాయ్ చెప్పారు. స్మార్ట్ ఫోన్ల మార్కెట్ లో ఎంతో పోటీ నెలకొని ఉందని, దీంతో పాటు హర్డ్ వేర్ పరిశ్రమ కూడా ఎంతో సమర్ధవంతమైన పరిశ్రమ అని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా గూగుల్ హోమ్ పేరుతో తీసుకువచ్చిన వాయిస్ యాక్టివేటెడ్ ప్రొడక్ట్ ను పిచాయ్ ఆవిష్కరించారు. దీంతో పాటు మెసేజింగ్ యాప్ అల్లో, వీడియో కాలంగ్ ఫీచర్ డ్యుయోను కూడా గూగుల్ సిఈవో పిచాయ్ ఆవిష్కరించారు. నెక్సెస్ ఫోన్ల తయారీ కోసం గూగుల్ అనేక కంపెనీలతో కలిసి పనిచేసింది.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -