Thursday, April 25, 2024
- Advertisement -

ఆ 122మంది నిర్దోషులే.. అసలు ఏమైంది అంటే..!

- Advertisement -

నిషేధిత ఉగ్రవాద సంస్థ సిమి(స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్​మెంట్ ఆఫ్ ఇండియా)కి చెందిన వారిగా ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన 122మందిని గుజరాత్​ సూరత్​ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. వీరంతా 2001 డిసెంబర్‌లో నిర్వహించిన సమావేశంలో పాల్గొనడం వల్ల.. చట్టవిరుద్ధ కార్యకలాపాల(నివారణ) చట్టం కింద అరెస్టయ్యారు. దాదాపు 20ఏళ్ల పాటు విచారణ సాగగా.. ఈ సమయంలోనే మరో ఐదుగురు నిందితులు మరణించారు.

అరెస్టయిన వారు సిమి సభ్యులని.. ఉగ్రవాద కార్యకలాపాల కోసమే సమావేశమయ్యారని రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్​​ విఫలమైందని కోర్టు పేర్కొంది. నిందితులపై అనుమానం ఉన్నప్పటికీ.. ఎలాంటి సాక్ష్యాలు లేనందున నిర్దోషులుగా తేలుస్తున్నట్టు సూరత్ ఛీఫ్​ జ్యూడీషియల్​ మేజిస్ట్రేట్​ ఏఎన్​ దవే​ వెల్లడించారు.

నిందితులను చట్టవిరుద్ధ కార్యకలాపాల కింద దోషులుగా ప్రకటించలేమని స్పష్టం చేశారు.సెప్టెంబర్​ 27 2001న ‘సిమి’ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది కేంద్రం. ఈ నేపథ్యంలో సూరత్​లో డిసెంబర్ 28 2001న ఓ సభ నిర్వహించిన 127 మందిని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అభియోగం కింద అథవాలిన్స్ పోలీసులు అరెస్టు చేశారు.

ఒకటేమో గాల్లోనే చక్కర్లు.. మరొకటి ఏకంగా రద్దు..!

వైరల్ అవుతున్న శర్వానంద్, రామ్ చరణ్ ఫోటోలు….!

ముత్తూట్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ జార్జ్‌ ముత్తూట్‌ కన్నుమూత..!

లాభ నస్టాలు లెక్క చెప్పిన సీఎం కేసిఆర్.. 2021-22 బడ్జెట్‌..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -