Monday, April 29, 2024
- Advertisement -

స్విమ్మింగ్ పూల్‌ను త‌ల‌పిస్తున్న ఢిల్లో రోడ్లు…

- Advertisement -

దేశ రాజధాని దిల్లీని మరోసారి భారీ వర్షాలు వణికిస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలోని ప్రధాన రహదారులన్నీ స్విమ్మింగ్ పూల్‌ను త‌ల‌పిస్తున్నాయి. త్యంత రద్దీగా ఉండే రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది.

ఖజూరీ చౌక్, వజీరాబాద్ రోడ్డు, భజన్ పురా మెయిన్ మార్కెట్, ఎంజీఎం రింగ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది.వికాస్‌ మార్గ్‌ లోని ఐపీ పైవంతెన వంటి ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. దీంతో ఈ మార్గాల్లో ప్రయాణాలు పెట్టుకోవద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా కూడా నిలిచిపోయింది.

ఇక ‘లోనీ రోడ్డు’ సమీపంలో ఐరన్ బ్రిడ్జి వద్ద వరదనీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు తోడు చాలాచోట్ల వర్షపు నీరు నిలిచిపోవడంతో అధికారులు విద్యుత్ సరఫరాను కొన్నిచోట్ల నిలిపివేశారు. సెంట్రల్‌ దిల్లీలోని ప్రధాన కేంద్రాల్లో వర్షపు నీరు భారీగా నిలిచింది. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించామ‌ని పోలీస్ అధికారి తెలిపారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ అలెర్ట్‌ ప్రకటించారు. కొన్ని చోట్ల నీరు భారీగా నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. 24 గంటల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -