Friday, April 26, 2024
- Advertisement -

ఒమైక్రాన్ ఎక్కడ పుట్టింది..? పుట్టుకకు కారణం ఏంటీ..?

- Advertisement -

ఒమైక్రాన్ పుట్టుకకు కారణం ఏంటీ ? మానవ తప్పిదం వల్లే ఒమైక్రాన్ పుట్టిందా ? వ్యాక్పినేషన్ ఒమైక్రాన్‎కు కారణంగా భావించొచ్చా ? ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ ఎందుకు వేసుకోవడం లేదు ? ప్రస్తుతం బ్రిటన్‎లో పరిస్థితి ఏ విధంగా ఉంది. భారత్‎కు తార్డ్ వేవ్ తప్పదా

ఒమైక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు విస్తరిస్తున్న వైరస్. ఈ కోవిడ్ కొత్త వేరియంట్ పుట్టుకకు మానవ తప్పిదాలే కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు వ్యాక్సిన్ తీసుకోకపోవడంతోనే ఒమైక్రాన్ విజృభిస్తుందని WHO తెలిపింది. ఫ్రాన్స్‎లో ఇప్పటికీ కోవిడ్ భాదితులకు చికిత్స అంధించలేక వైద్యులు అలసిపోతున్నారని, టీకా తీసుకోని వారిపై కఠిన చర్యలు తప్పవని ఫ్రాన్స్ ప్రభుత్వం తెలిపింది. ఈ వైరస్ సౌతాఫ్రికాలో పుట్టినప్పటికీ దీని ప్రభావం ఇంగ్లండ్‎పై పడింది. నిన్న ఒక్కరోజే 78 వేల 610 మందికి ఈ మహమ్మారి సోకినట్లు బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.

మరోవైపు ఈ వైరస్ భారత్‎లో బయటపడుతోంది. భారత పౌరులు వాక్సిన్ వేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేసినా కొందరు ప్రజలు మాత్రం వ్యాక్సిన్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్‎ వస్తాయని, టీకా వికటించి చనిపోతామనే భయంతో ప్రజలు టీకాలు వేసుకోవడంలేదు. దీంతో ఆరోగ్య అధికారులు గ్రామ స్థాయిలో పర్యటించి టీకా వల్ల కలిగే లాభాల గురించి పల్లె ప్రజలకు వివరిస్తున్నారు. ఐనా కొందరు గ్రామస్తులు టీకా వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. ప్రజలు టీకాలు వేసుకోకుంటే బ్రిటన్‎ మాధిరిగానే భారత్‎లో సైతం ఒమైక్రాన్ విజృంభించే అవకాశం లేకపోలేదు. ఒకవేళ ఈ వైరస్ భారత్‎లో విజృంభిస్తే పరిస్థితి సెకండ్ వేవ్ కంటే దారుణంగా ఉండే అవకాశం ఉంది. మరో వైపు ఈ వైరస్ ఇప్పుడు చిన్నపిల్లలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

మరోవైపు ఈ కొత్త వేరియంట్ హెచ్ఐవీ పేషెంట్స్ నుంచి వెలుగులోకి వచ్చినట్లు విస్తృత చర్చ జరుగుతోందీ. దీంతో ఆక్స్‎ఫర్డ్ నిపుణులు పరిశోదనలు చేస్తున్నారు. ఈ వైరస్‎ పుట్టుకకు గల కారణాలు అధికారికాంగా తెలియకపోయినా… పరిశోధకులు మాత్రం తమ అన్వేషణ మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే తాము కనుగొన్న టీకా ఒమైక్రాన్‎ వైరస్ నియంత్రణకు పని చేస్తుందని అమెరికాకు చెందిన ఫైజర్ సంస్థ తెలిపింది. డబ్ల్యూహెచ్ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఒమైక్రాన్‌ టీకాలు లభించేనా ?

కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్న.. ఒమైక్రాన్‌ సోకుతుందా ?

కొత్తగా ట్రై చేశారు.. ఇంప్లిమెంటేషన్‌ ఫెయిల్.. ఏం జరిగింది..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -