Friday, May 3, 2024
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వ‌చ్చిన‌ మ‌రో అన‌లైటికా డేటా చోరీ స్కామ్‌…

- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త డేటా చోరి బాగోతం వెలుగులోకి వ‌చ్చింది. ఇప్పుడు ఇదే రెండు రాష్ట్రాల‌ను కుదిపేస్తోంది. ఐటీ గ్రిడ్స్‌ ఇండియా కంపెనీ పేరుతో చేస్తున్న ‘పచ్చ’ కుట్రలను సైబరాబాద్‌ పోలీసులు గుట్టురట్టు అయింది. ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన ఓట్లను తొలగించేందుకు లక్షలాది మంది డేటాను సేకరించి హైదరాబాద్ లోని ఐటీ గ్రిడ్ ఆఫ్ ఇండియా, బ్లూ ఫ్రాగ్ టెక్నాలజీస్ వంటి ఐటీ సంస్ధలకు ఇచ్చారన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన తెలంగాణా పోలీసులు నలుగురు ఐటీ ఉద్యోగుల‌ను అరెస్ట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఏపీలోని ఓటర్ల డేటాతో పాటు వారి ఆధార్, ఇతర వివరాలను ఏపీ ప్రభుత్వం హైదరాబాద్ లోని మాదాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న డేటా గ్రిడ్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిందన్న ఫిర్యాదుపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ కంపెనీ దగ్గర ఏపీకి చెందిన మూడు కోట్ల 70 లక్షల మందికి సంబంధించిన అన్ని వివరాలు ఉన్నాయి. ఈ వివరాలను ఏపీ ప్రభుత్వమే అప్పగించింది అన్నది ఇప్పుడు ప్రధాన ఆరోపణ. వీరి వద్ద ఉన్న డేటాలో ఏపీ ప్రజలకు సంబంధించిన ఆధార్‌, రేషన్ కార్డు, కలర్ ఫోటోలు, ఫోన్ నెంబర్లు, ఆర్ధిక సామర్థ్యం, కులం, మతం ఇలా అన్ని వివరాలు ఉన్నాయి.

అయితే దీని వెనుక టీడీపీ నేత‌ల హ‌స్తం ఉంద‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ గ్రిడ్స్‌ ఇండియా కంపెనీ… టీడీపీకి చెందిన అధికారక ‘సేవామిత్ర’ యాప్‌ను రూపొందించింది. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రజల ఓటర్ల ఆధార్‌ డాటాతో పాటు వ్యక్తిగత వివరాలును ఐటీ గ్రిడ్స్‌ యధేచ్ఛగా వాడుకుంది. దీనిపై వైసీపీ నేత విజ‌య‌సాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు తెలంగాణా పోలీసులు ఐటీ గ్రిడ్స్‌లో సోదాలు నిర్వ‌హించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో భాస్కర్ అనే ఉద్యోగి కనిపించడం లేదని గుంటూరులో ఐటీ గ్రిడ్ బ్రాంచ్ యాజమాన్యం ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఓటర్ల డేటా చౌర్యం కేసు విచారణలో భాగంగా తాము భాస్కర్ ను అదుపులోకి తీసుకున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఏపీ పోలీసులకు స్పష్టం చేశారు. భాస్కర్‌ను తమకు అప్పగించాలని ఏపీ పోలీసులు కోరారు. అయితే భాస్క‌ర్‌ను అప్ప‌గించేందుకు తెలంగాణా పోలీసుల స‌సేమీరా అన‌డంతో ఇది మ‌రింత క్లిష్టంగా మారింది.

మాదాపూర్ లోని ఐటీ గ్రిడ్ ఆఫ్ ఇండియా వ్యవస్ధాపకుడు దాకవరపు అశోక్ పరారీలో ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. డేటా చౌర్యం కేసు దర్యాప్తులో భాగంగా డేటా గ్రిడ్ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించే ప‌నిలో ప‌డ్డారు. డేటా గ్రిడ్ తో పాటు కూకట్ పల్లిలోని బ్లూ వేల్ టెక్నాలజీస్ సంస్ధ కార్యాకలాపాలపైనా సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టిసారించారు. దీంతో ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.

ఇద‌లా ఉంటే ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఏపీ పోలీసులు అనధికారికంగా గస్తీ తిరుగుతున్నారు. ఆ కార్యాలయం సమీపంలోని ఓ ప్రయివేట్‌ కళాశాలలో పోలీసులకు ఏపీ ప్రభుత్వం బస ఏర్పాటు చేసింది.సేవా మిత్ర యాప్‌లో ఒక వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారంతోపాటు ఆధార్‌ వివరాలు, ప్రభుత్వం నుంచి లబ్ది పొందిన వారి వివరాలతోపాటు కలర్‌ ఫోటో కూడా ఉంది. ఇది ఎన్నికల సంఘం, ఆధార్‌ నిబంధనలకు విరుద్ధం. అయితే ప్ర‌జ‌ల డేటా ఎలా వ‌చ్చింద‌న్న దానిపై ఆధారాలు లేవు. తెలంగాణా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆధారాలు సేక‌రించే ప‌నిలో ప‌డ్డారు. ఈ వ్యవహారం రాజకీయంగా ఇరు రాష్ట్రాల్లోనూ ప్రక్రంపనలు సృష్టిస్తోంది. ఎన్నికల వేళ ఇది ఎక్కడికి పోతుందో అన్న అనుమానం టీడీపీలో వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -