నా భార్యకు ముద్దు కూడా పెట్టలేదు: ఫరూక్​ అబ్దుల్లా

- Advertisement -

కరోనా సమయంలో తన భార్యకు ముద్దు కూడా పెట్టలేదని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్​ అబ్దుల్లా అన్నారు. ఓ పుస్తక కార్యక్రమంలో పాల్గొనేందుకు జమ్మూ వచ్చిన అబ్దుల్లా.. తన 35 నిమిషాల ప్రసంగంలో నవ్వులు పూయించారు. కరోనా.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందని అన్నారు. తానూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని వివరించారు.

కొవిడ్​-19 టీకాలు వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేసిన అబ్దుల్లా.. త్వరలోనే ఈ మహమ్మారి పీడ విరగడవ్వాలని అందరూ దేవుడిని ప్రార్థించాలని కోరారు.

- Advertisement -

ఎదుటి వ్యక్తితో చేతులు కలపడానికి భయమేస్తోంది. నిజాయతీగా చెబుతున్నా నేనైతే నా భార్యకు ముద్దు కూడా పెట్టలేదు. ఏమో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. ఇక కౌగిలింత ప్రసక్తే లేదు. మనసెంత కోరుకున్నా సరే అని అన్నారు.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News