Monday, May 6, 2024
- Advertisement -

రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిపాదనలు

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో భూముల విలువను పెంచాలని రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈ ప్రతిపాదన ఉన్నా ప్రభుత్వం అంగీకరించలేదు. అయితే ఈ సారి మాత్రం భూముల విలువను పెంచాల్సిందేనని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. విలువల పెంపు కసరత్తుపై ఈ నెల 20 వ తేదిన డిఐజిలు, రిజిస్టార్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. పెరిగిన విలువలు ఆగస్టు ఒకటో తేది నుంచి అమలులోకి వస్తాయి. ఈ పెంపు వల్ల ప్రభుత్వానికి మంచి ఆదాయమే ఉంటుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. తెలంగాణ జిల్లాల్లో భూముల రిజిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వానికి ఇంతకు ముందు మంచి ఆదాయమే వచ్చింది.

గడచిన సంవత్సరం అంటే 2015 _ 2016 లో 15 శాతం ఆదాయం రిజిస్ట్రేషన్ల శాఖకు వచ్చింది. కొత్త పెరిగిన భూమి విలువల కారణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరిగి మరింత ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -