Thursday, May 9, 2024
- Advertisement -

రేవంత్ ఇంట్లో భారీగా నగదు, బంగారం స్వాధీనం… ఈడీ అదుపులో సోదరుడి భార్య!

- Advertisement -

గురువారం ఉదయం నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, ఆయన సన్నిహితులుకు సంబంధించిన 15 ఇళ్లపై ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పక్కా ముందస్తు సమాచారంతోనే ఐటీ శాఖ, ఈడీ రేవంత్ రెడ్డి, ఆయన ఇళ్లపై దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో ఆయన అక్రమ ఆదాయానికి, ఆస్తులకు సంబంధించి కీలక ఆదారాలను సేకరించినట్లు వార్తలొస్తున్నాయి.

హైదరాబాద్, జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటి నుంచి ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కోటిన్నర రూపాయల నగదు, పెద్దఎత్తున బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో చెప్పాలని అధికారులు వేసిన ప్రశ్నలకు రేవంత్ సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. బంగారు నగలపైనా బిల్లులు చూపాలని అధికారులు అడగ్గా, అవి తమ పూర్వీకుల నుంచి వచ్చినవని రేవంత్ కుటుంబీకులు సమాధానం ఇచ్చినట్టు అనధికార వర్గాల స‌మాచారం.

దీంతో వాటిని ప్రస్తుతం స్వాధీనం చేసుకుంటున్నామని అధికారులు వెల్లడించినట్టు తెలిసింది. మరోవైపు రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి మాదాపూర్ లో నివాసం ఉంటుండగా, ఆయన ఇంట్లోనూ నిన్నటి నుంచి తనిఖీలు నిర్వ‌హించారు. కొండాల్‌ రెడ్డి భార్యను ఏడు గంటలకుపైగా రహస్య ప్రదేశంలో విచారించారు. పలు కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది.

కొండల్ రెడ్డి భార్యను అదుపులోకి తీసుకున్న అధికారులు, బ్యాంకు లాకర్లను తెరిచేందుకు తీసుకెళ్లారు. ఆ లాకర్లలో కొన్ని ముఖ్యమైన దస్త్రాలు ఉండివుండవచ్చని ఈడీ భావిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -