Saturday, April 20, 2024
- Advertisement -

టీకా తీసుకుంటున్న సమయంలో ఒత్తిడికి గురైన జో బైడెన్‌..!

- Advertisement -

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు. 78 ఏళ్ల బైడెన్‌ 2020 డిసెంబర్‌ 21న ఫైజర్‌ టీకా తొలి డోసు తీసుకున్నారు. ఈ ఘట్టాన్ని ఆ సమయంలో అమెరికా ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ప్రజల్లో వ్యాక్సిన్‌పై ఉన్న అపోహలను పోగొట్టేందుకే బహిరంగంగా టీకా తీసుకున్నట్లు బైడెన్‌ ప్రకటించారు. ఇప్పుడు టీకా రెండో డోసు తీసుకున్నారు. ఎవరైనా కరోనా టీకా తొలి డోసు తీసుకున్నాక.. రెండు డోసును తీసుకోవాల్సిందే.

రెండో సారి టీకా తీసుకుంటున్న సందర్భంలో కాస్త ఒత్తిడికి గురయ్యానని బైడెన్ తెలిపారు. అమెరికా ప్రజలందరికీ కరోనా టీకా అందించడమే తన ప్రథమ కర్తవ్యమని బైడెన్‌ పేర్కొన్నారు.

ఇప్పటి వరకు అమెరికాలో 2,23,85,975 మంది కరోనా బారిన పడగా, 3,74,072 మంది చనిపోయారు. అమెరికాలో కొద్దిరోజుల క్రితం నెమ్మదించిన కరోనా కేసులు మళ్లీ ఇటీవల పెరుగుతున్నాయి. అంతేకాకుండా కొత్తరకం స్ట్రెయిన్‌ కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలో తీవ్ర అలజడి నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -