Friday, May 3, 2024
- Advertisement -

ఓటు వేయండ ప్రీగా దోశ తినండి….క‌ర్నాట‌క‌లో హోట‌ల్ వినూత్న ప్ర‌యోగం

- Advertisement -

ఎన్నిక‌ల్లో ఓట్ల శాతాన్ని పెంచేదానికి ఈసీ ప్ర‌య‌త్నాలు చేయ‌డం మామూలే. ఓటు వేయాలంటూ టీవీల్లో ప్ర‌క‌ట‌న‌లు, అవ‌గాహ‌న స‌ద‌స్సులు నిర్వ‌హిస్తుంది. రాజ‌కీయ నాయ‌కులైతే ఓట‌ర్ల‌కు ప్ర‌యాణ ఖ‌ర్చులు ఇచ్చి మ‌రో ఓట‌ర్ల‌ను ర‌ప్పించుకుంటుంటారు.

గత కొంతకాలంగా ఎన్నికల్లో బెంగుళూరులోనే తక్కువ ఓటింగ్‌ నమోదవున్నట్లు ఈసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓట్ల‌శాతాన్ని పెంచేందుకు క‌ర్నాట‌క‌లో హోట‌ల్ వినూత్న ప్ర‌య‌త్నం చేశాడు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారికి దోశ, మిగితా వారికి ఫిల్టర్‌ కాఫీ ఉచితంగా ఇస్తామని ప్రకటించాడు. ఓటు వేసి వచ్చిన అనంతరం ఇంక్‌ మార్క్‌ ఉన్న తమ వేళ్లను చూపించి ఉచితంగా కాఫీ తాగొచ్చని తెలిపాడు. ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది నిసర్గ గ్రాండ్ హోటల్ యజమాని కృష్ణరాజ్.

బెంగళూరులో నమోదవుతున్న తక్కువ ఓటింగ్ శాతాన్ని పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఓటర్లు ఏ అభ్యర్థికి ఓటు వేశారనే దాని కన్నా, ఓటు హక్కు వినియోగించుకున్నారా? లేదా? అనేది ముఖ్యమని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -