Sunday, April 28, 2024
- Advertisement -

క‌ర్నాట‌క‌లో మ్యాజిక్ ఫిగ‌ర్‌ను దాటేసిన భాజాపా…

- Advertisement -

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీని సాధించే దిశగా పరుగులు పెడుతోంది. ఫ‌లితాలు వెలువ‌డుతున్న కొద్దీ కాంగ్రెస్ వెనుక‌బ‌డిపోతోంది. హంగ్ తరహా పరిస్థితులు ఖాయమన్న అంచనాల‌ను త‌ల‌క్రిందులు చేస్తూ మ్యాజిక్ ఫిగర్ దిశగా దూసుకుపోతోంది.

222 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగగా, బీజేపీ ప్రస్తుతం ఒకచోట విజయం సాధించి, 118 చోట్ల ఆధిక్యంలో కొన‌సాగుతోంది. కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న స్థానాల సంఖ్య 65 నుంచి 57కు పడిపోగా, జేడీఎస్ 44 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఈ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 112 కాగా, బీజేపీ సునాయాసంగా ఆ మార్కును అధిగమించేలా కనిపిస్తుండగా, జేడీఎస్ తో ఎటువంటి పొత్తూ లేకుండానే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు యడ్యూరప్ప సిద్ధమవుతున్నారు.

.తాను 15వ తేదీ సాయంత్రం ఢిల్లీకి వెళ్లి, ఆపై 17వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నానని మూడు రోజుల క్రితం యడ్యూరప్ప ప్రకటించినట్లుగా క‌ర్నాట‌క సీఎంగా య‌డ్యూర‌ప్ప ప్ర‌మాణస్వీకారం చేయ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -