Sunday, April 28, 2024
- Advertisement -

రోజుకో మలుపు తిరుగుతున్న రాజ్యసభ ఎన్నిక

- Advertisement -

కర్నాటకలో రాజ్యసభ ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇక్కడ స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోయిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు మరో 14 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.  

ఓటుకు 10 కోట్ల రూపాయలిస్తే క్రాస్ ఓటింగ్ చేస్తామంటూ ఎమ్మెల్యేలు స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోయిన సంగతి తెలిసిందే. వీరితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు తాజాగా అజ్ఞాతానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ముందు అనుకున్న విధంగా షెడ్యూల్ ప్రకారం కర్నాటకలో రాజ్యసభ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఎన్నికల సంఘాన్ని కోరారు.

అయితే స్టింగ్ వ్యవహారం లీకైనందున ఇక్కడ ఎన్నికలు వాయిదా వేయాలని  ప్రతిపక్ష జేడీఎస్ ఈసీకి లేఖ రాసింది. మరోవైపు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండూ అదనపు స్ధానాన్ని గెలుచుకోవడం కోసం అవసరమైన సభ్యులను కాంగ్రెస్ పార్టీ ముంబైకి తరలించినట్లు చెబుతున్నారు. వీరంతా సమాచారం కూడా వెళ్లని స్ధలంలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -