Monday, May 6, 2024
- Advertisement -

వైఎస్ జ‌గ‌న్‌పై హత్యాయ‌త్నం..చంద్ర‌బాబుపై మండిప‌డ్డ‌ కేసీఆర్‌

- Advertisement -

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గురువారం హత్యాయ‌త్నం జ‌రిగింది.విశాఖపట్నం విమానాశ్రయంలో జ‌గ‌న్‌పై దాడి జరిగింది. విమానాశ్రయం లాంజ్ లో కూర్చుని ఉండగా ఆయనపై గుర్తుతెలియ‌ని వ్యక్తి దాడి చేశాడు.జ‌గ‌న్ దాడిని ఖండించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎలాంటి పాల‌న జ‌గ‌రుతుందో ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని కేసీఆర్ పెర్కొన్నారు.ఒక బాధ్య‌యుత ప్ర‌తిప‌క్ష‌నేత‌పై ఇలా హ‌త్య‌య‌త్నం చేయ‌డం చాలా దారుణం అని కేసీఆర్ తెలిపారు.ఇలాంటి దాడులు జ‌గ‌న్‌ను భ‌య‌పెట్ట‌లేవ‌ని ,అత‌ను చాలా మొండి మ‌నిషి ,ధైర్యంతో ముందుకు వెళ్తడాని ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడారు.

జ‌గ‌న్‌కు ఈ దాడి నుంచి త్వ‌రగా కోలుకోవాలని ఆశిస్తున్నానని చెప్పారు కేసీఆర్‌.ఇకనైనా చంద్ర‌బాబు ప‌క్క రాష్ట్రం మీద కాకుండా ఆయ‌న సొంతం రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను సరి చేసుకోవాల‌ని హిత‌వు పలికారు కేసీఆర్‌.వెయిటర్ పోర్క్ తో ఆయనపై దాడి చేశారని సమాచారం అందుతోంది. దాడి చేసిన వ్య‌క్తిని విమానాశ్రయం భద్రతా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హైదరాబాదు రావడానికి జగన్ విశాఖ విమానాశ్రయానికి వచ్చారు. ఈ సమయంలో ఆయనపై దాడి జరిగింది.జగన్ ఎడమ భుజంపై స్వల్పంగా గాయమైంది. ప్ర‌థ‌మ చికిత్స తీసుకున్న జ‌గ‌న్ వెంట‌నే హైద‌రాబాద్ బ‌య‌లు దేరారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -