Monday, April 29, 2024
- Advertisement -

కివీ పండ్లు..మంచివే కానీ!

- Advertisement -

ప్రతీ రోజు పండ్లు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. పండ్లలో ఉండే గుణాల వల్ల రోగనిరోధక శక్తి పెరగడే కాకుండా ఆరోగ్యంగా ఉండటానికి,రోగాల బారి నుండి బయటపడవచ్చు. ఇందులో కివీ పండుది ప్రధాన పాత్ర.

డెంగ్యూ లేదా వైరల్ ఫీవర్ వచ్చినవారిలో ప్లేట్ లెట్స్ తగ్గిన సమయంలో కివీ పండ్లను ఎక్కువగా తీసుకుంటే ప్లేట్ లేట్స్ సంఖ్య పెరుగుతుంది. కివీలో కేలరీలు తక్కువగా ఉండి విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఇ, పొటాషియం, ఫోలేట్ అధిక మొత్తంలో ఉండటంతో జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడటానికి దోహదం చేస్తుంది.

ఆరోగ్యకరమైన చర్మం, బలమైన కణజాలాలకు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సాయపడుతుంది. కంటి చూపును మెరుగుపర్చడంలో వయస్సు-సంబంధిత మచ్చల క్షీణతను నివారించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి.
మెదుడు పనితీరును, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వారు కివీ పండ్లను తినకపోవడమే మంచిది. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ పండ్లను ఏమాత్రం తినకూడదు. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యలు ఉన్నవారు కివీ పండ్లకు దూరంగా ఉండాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -