Thursday, April 25, 2024
- Advertisement -

నేటి నుంచి పాఠశాలలు బంద్

- Advertisement -

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతంది. గడిచిన 24 గంటల్లో 1600 ఒమిక్రాన్ కేసులు బయటపడినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ముంబై, ఢిల్లీల్లో పెద్ద మొత్తంలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలను అములు చేస్తున్నాయి. రాత్రి పూట కర్ప్యూ వంటివి అమలు చేస్తున్నాయి.

తాజాగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కఠిన ఆంక్షల అమలుకు సిద్ధమైంది. జనవరి 3 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని నిర్ణయించింది. పలు రాష్ట్రాల నుంచి రాకపోకలపై ఆంక్షలు విధించింది. విదేశాల నుంచి వచ్చే విమానాలపై సైతం ఆంక్షలు అమలు చేస్తున్నది.

పర్యాటక ప్రాంతాలను సైతం మూసివేస్తున్నారు. లోకల్ ట్రైన్లు 50 శాతం సామర్థ్యంతో పని చేయనున్నాయి. సినిమా
హాళ్లు సైతం 50 శాతం పరిమితితోనే నడపాలి. సభలు సమావేశాలపై కూడా ఆంక్షలు ఉంటాయని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెచ్ .కె. ద్వివేది తెలిపారు.

సింహాలు అంత‌రించిపోతాయా?

హై అలర్ట్‌ .. థర్డ్‌ వేవ్‌ వచ్చేసింది

రీల్ జంటలు రియల్ లైఫ్ లో ఒక్కటైన హీరో, హీరోయిన్లు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -