Sunday, April 28, 2024
- Advertisement -

ఆలస్యంగా సీఎం టూర్ వెనక మర్మమేంటి..?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపటి నుంచి వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడి దాదాపు 20 రోజులు దాటింది. గతంలో ఏరియల్ సర్వే చేసిన జగన్.. ఇప్పుడు బాధితుల వద్దకు వెళ్లాలని అనుకుంటున్నారు ? ఇటీవలే విపక్ష నేత చంద్రబాబు జిల్లాల పర్యటనలో ఉన్నారని వెళ్లలేదా ? జిల్లాల్లో వరదలు తగ్గాయని వెళ్తున్నారా ? సీఎం టూర్ వెనక మర్మమేంటి

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు చిత్తూరు జిల్లాకు వెళ్లనున్నారు. జిల్లాలోని రేణిగుంట మండల పరిధిలోని ఎస్టీ కాలనీలో సీఎం పర్యటించనున్నారు. అక్కడ వారికి అందుతున్న సౌకర్యలు ప్రభుత్వ అధికారులు వారికి ఎలాంటి సహాయ సౌకర్యలు చేశారని స్వయంగా జగన్ తెలుసుకోనున్నారు. అక్కడ రైతులకు జరిగిన పంట నష్టం గురించి ఆరా తీయనున్నారు. అనంతరం తిరుచనూరులో జగన్ పర్యటించి అధికారులతో సమావేశం అవ్వుతారు. తిరుపతి నగరంలోని శ్రీకృష్ణా నగర్‌లో సీఎం పర్యటించనున్నారు. అక్కడ ప్రజలతో మాట్లాడనున్నారు. రేపు రాత్రి పధ్మావతి సన్ని దానంలో భసచేయనున్నారు.

ఈనెల3న కడప జిల్లాలో వరద వల్ల నిరాశ్రయులైన వారితో సీఎం మాట్లాడనున్నారు. వారికి ఆర్థిక భరోసా ఇవ్వనున్నారు. వర్షాలకు దెబ్బతిన్న , పంటపొలాలు, చెర్వులను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నెల్లూరు జిల్లాకు బయలుదేరనున్నారు. సీఎం నెల్లూరు జిల్లాలో వరదలకు పంటలు నష్టపోయిన రైతుల వద్దకు వెళ్లి వారికి ప్రభుత్వం తరుపున భరోసా ఇవ్వనున్నారు. అక్కడి నుంచి జగన్ తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.

మరో వైపు సీఎం జగన్ ఆలస్యంగా రైతుల వద్దకు వెళ్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో ఏరియల్ సర్వే చేసిన.. ప్రజల వద్దకు వెళ్లకపోవడంతో చంద్రబాబు తీవ్రస్తాయిలో విమర్శలు చేశారు. దీంతో జగన్ చంద్రబాబుకు బయపడే జిల్లాల పర్యటనకు వెళ్తున్నారని, చంద్రబాబు ప్రశ్నించకపోతే ముఖ్యమంత్రి ప్రజలను పట్టించుకునేవారే కాదని పలువురు టీడీపీ నేతలు సైతం విమర్శిస్తున్నారు.

సీఎం జగన్‌పై ఉండవల్లి ఫైర్..

సిరివెన్నెల పాట.. నందుల పూదోట

Photos: గోశాలను సందర్శించిన సీఎం జగన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -