Friday, May 3, 2024
- Advertisement -

పదేళ్ల తర్వాత వస్తున్న అరుదైన సన్నివేశం

- Advertisement -

ఆకాశంలో అద్భుతం జరగనుంది. పదేళ్ల క్రితం జరిగిన ఈ సన్నివేశం మళ్లీ ఈ నెల 9 వ తేదిన ఆకాశంలో ఆవిషృతం కానుంది. ఆకాశంలో బుధ గ్రహం సూర్యుడ్ని దాటి ముందుకు వెళ్తుంది. ఈ అరుదైన సన్నివేశాన్ని చూడాలనుకునే  వారు సాధారంగా చూసినట్లుగానే చూడకూదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఈ నెల 9 వ తేదిన సాయంత్రం 4.15 నుంచి 6.20 వరకూ బుధ గ్రహం సూర్యుడ్ని దాటి వెళ్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బుధ గ్రహ వ్యాసం సూర్యుని కంటే చిన్నదిగా ఉండడం వల్ల ఆకాశంలో చిన్న చుక్కలా కనిపిస్తుంది. ఈ సుందర, అపురూప దృశ్యాన్ని వీక్షించేందుకు చెన్నైలోని బిర్లా ప్లానిటోరియంలో నాలుగు టెలీస్కోపులు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ అరుదైన సంఘటన ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా సంభవిస్తుంది. గతంలో 2006 నవంబర్ 8 వ తేదిన ఈ అపూర్వ సంఘటన సంభవించింది. పదేళ్ల తర్వాత మళ్లీ ఈ నెల 9 తేదిన అద్భుతం ఆవిష్కృతమవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -