Friday, May 3, 2024
- Advertisement -

ఏపీకీ ప్ర‌త్యేక హోదా సాధ్యంకాద‌ని తేల్చేసిన‌ అరుణ్ జైట్లీ…

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వ‌లేమ‌ని మ‌రోసారి కేంద్ర‌హోంమంత్రి అరుణ్ జైట్లీ స్ప‌ష్టం చేశారు. గ‌త కొన్ని రోజులుగా ప్ర‌త్యేక‌హోదా ఉద్య‌మం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఏపీ కి రావాల్సి ప్ర‌యోజ‌నాల‌తోపాటు హోదా విష‌యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి సుజనా చౌదరితో గంటసేపు చర్చించారు.

అనంత‌రం మిడియాతో మాట్లాడుతూ జీఎస్టీ రాబడి కేంద్ర, రాష్ట్రాలకు పంపిణీ జరుగుతుందని అన్నారు. తగినంత రాబడి లేకపోవడం వల్లే ఆశాన్య రాష్ట్రాలకు గతంలో ప్రత్యేక హోదా ఇచ్చారని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలకు 90:10 నిష్పత్తిలో నిధుల పంపిణీ జరుగుతోందని వివరించారు. ఏపీకికూడా ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో 90:10 నిస్ప‌త్తిలో నిధులు అందించేందుకు మార్గాల‌ను అన్వేషిస్తున్నామ‌న్నారు.

కొన్ని పరిణామాల వల్ల ప్రత్యేక హోదా అనే విధానమే మనుగడలో లేకుండా పోయిందని జైట్లీ చెప్పారు. ప్రస్తుతం ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు లేవని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజలకు ఇష్టం లేకుండానే రాష్ట్ర విభజన జరిగిందని, ఆ సమయంలో ఏపీకి రెవెన్యూ లోటు పూడ్చాలని విభజన చట్టంలో ఉందని అన్నారు. ఏపీకి సాయం చేస్తామని చెప్పారు. ఏపీ తీసుకునే విదేశీ రుణాల్లో 90 శాతం కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -