Thursday, May 2, 2024
- Advertisement -

డోక్లాం నుంచి సైన్యాన్ని ఉపసంహరించం…. భార‌త్‌…

- Advertisement -
Never Withdraw Indian troops from Dokalm Sikkim

చైనాకు భారత్ ధీటైన జవాబునిచ్చింది. చైనా బెదిరింపులకు తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. అదేసమయంలో సిక్కిం భూభాగంలో ఉన్న డోకా లా ప్రాంతంలో బ‌ల‌గాల‌ను వెన‌క్కి పిలిచే ఆలోచ‌న లేదని తేల్చి చెప్పింది.

డోక్లాం నుంచి వెంటనే బేషరతుగా సైన్యాన్ని ఉపసంహరించాలని, ఆ తరువాతే సమస్యల పరిష్కారానికి చర్చలు జరుపుతామని చైనా హెచ్చరించినా, వెనక్కు తగ్గేందుకు మోదీ సర్కారు సిద్ధంగా లేదు.
బెంగాల్‌, అస్సాం రోడ్ లింక్‌కు కేవ‌లం 30 కిలోమీట‌ర్ల దూరంలో వివాదాస్ప‌ద ప్రాంతంలో చైనా ఓ రోడ్డు నిర్మాణం చేపట్టింది. దీన్ని భార‌త్ తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. ఇక్కడి నుంచి ప్రవహిస్తూ, బ్రహ్మపుత్రలో కలిసే జల్ ధాకా, తోర్షా నదులపై హైడల్ ప్రాజెక్టులను, వాటిని కలిపేందుకు రహదారులను చైనా నిర్మించాలని భావిస్తోంది.
ఇదిలావుండగా, సిక్కిం సెక్టారులో భారత్, చైనాలు సుమారు 200 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ ప్రాంతంలో సరిహద్దు రేఖ స్పష్టంగా లేకపోవడంతోనే సమస్యలు వస్తున్నాయని భారత్ చెబుతోంది. నేతల సమక్షంలో 2012లో భారత్, చైనా మధ్య కుదిరిన ‘ట్రై జంక్షన్ పాయింట్స్’ ఒప్పందాన్ని చైనా ఉల్లంఘిస్తోందని, అది దేశ సార్వభౌమత్వానికి విఘాతమని, అటువంటి చర్యలను చూస్తూ ఊరుకోబోమని భారత్ స్పష్టం చేసింది.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}H6o9bCyRs1U{/youtube}

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -