Saturday, April 27, 2024
- Advertisement -

ఫ‌లించిన పోలీసుల వ్యూహం

- Advertisement -
  • హైద‌రాబాద్ పోలీసుల చ‌ర్య‌ల‌తో వేడుక‌లు ప్ర‌శాంతం
  • పోలీస్‌స్టేష‌న్‌ల ఎదుట బారులుతీరిన కార్లు
  • డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 1,500 వాహ‌నాలు సీజ్‌

న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో మునిగి తేలిన ప్ర‌జ‌ల‌కు హైద‌రాబాద్‌లో పోలీసులు చుక్క‌లు చూపించారు. న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో ఫుల్‌గా తాగేసి ఎంజాయ్ చేసి వాహ‌నాలు న‌డుపుకుంటూ ఇంటికి వెళ్తున్న వారిపై పోలీసులు కొర‌డా ఝుళిపించారు. పోలీసులు ముందే ప్ర‌క‌ట‌న‌లు చేశారు. తాగి వాహ‌నాలు న‌డ‌పొద్దు.. మీకోసం స్పెష‌ల్‌గా క్యాబ్‌లు కూడా అందుబాటులో ఉంచాం.. తాగి వాహ‌నం న‌డిపితే క‌ఠిన చ‌ర్య‌లు అని వారం నుంచి చెబుతూనే వ‌చ్చారు. అయినా ఇవ‌న్నీ ప‌ట్టించుకోని ప్ర‌జ‌ల‌కు హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు సీరియ‌స్ అయ్యారు. దొరికినోడిని దొరికిన‌ట్టు కారు, బండ్లు సీజ్ చేసి పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

హైద‌రాబాద్‌లో జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ల ప‌రిధిలో చాలా ప‌బ్‌లు, హోట‌ళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల‌కు బాగా డ‌బ్బున్న‌వాళ్లంద‌రూ వ‌చ్చి ఎంజాయ్ తాగి తంద‌నాలు ఆడి ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్తున్న క్ర‌మంలో పోలీసులు క‌నిపించారు. వెంట‌నే ఎక్కింది దిగేసింది. పోలీసులు క‌నిపించ‌గానే వాళ్ల న‌ట‌న‌లు చూడాలి. ఆస్కార్ అవార్డు ఇచ్చేంత గొప్ప‌గా న‌టించారు. అయినా విన‌ని పోలీసులు వారంద‌రినీ అదుపులోకి తీసుకొని వాహ‌నాల‌ను పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు. జ‌రిమానాలు విధించారు.

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ట్రాఫిక్‌ పోలీసులు సోమవారం తెల్లవారుజాము వరకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు. 150 బృందాలుగా ఏర్పడిన పోలీసులు అనేక చోట్ల బారికేడ్లు ఏర్పాటుచేసి శ్వాస పరీక్షలు నిర్వహించారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా సుమారు 1500కు పైగా వాహనాలను స్వాధీనం చేశారు. ఆ సీజ్‌ చేసిన వాహనాలను ఆయా పరిధిలోని పోలీస్‌స్టేషన్లకు తరలించారు. జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో ఎక్కువ వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణమంతా నిండిపోయింది. లోపల స్థలం చాలక కొన్ని కార్లను రోడ్డు పక్కనే నిలిపివేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న కార్లలో ఖరీదైనవీ ఉన్నాయి. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి మంగళవారం కౌన్సిలింగ్‌ నిర్వహించి అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ ప‌రీక్ష‌ల్లో ప్ర‌ముఖులు ప‌ట్టుబ‌డ్డారు. వారెవ‌రి పేర్లు బ‌య‌ట ప‌డ‌లేదు. కానీ తెలుగు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా ఉన్నార‌ని తెలుస్తోంది. ఒక్క యాంక‌ర్ ప్ర‌దీప్ మాత్రం బ‌హిర్గ‌త‌మ‌య్యాడు. అయితే పోలీసుల ముందస్తు చ‌ర్య‌ల‌తో ఎలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ప్ర‌శాంతంగా న్యూ ఇయ‌ర్ వేడుక‌లు ముగిశాయి. దీంతో పోలీసులు, తెలంగాణ ప్ర‌భుత్వం ఊపిరి పీల్చుకుంది. ఈ విధంగా చేయ‌డంతో ప్ర‌జ‌లు పోలీసుల‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నారు.

[ngg_images source=”galleries” container_ids=”21″ display_type=”photocrati-nextgen_basic_imagebrowser” ajax_pagination=”0″ order_by=”sortorder” order_direction=”ASC” returns=”included” maximum_entity_count=”500″]

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -