Friday, May 3, 2024
- Advertisement -

ఐటి దిగ్గజ సంస్ధల మధ‌్య పోటీ

- Advertisement -

యాపిల్, గూగుల్. ఈ రెండూ ప్రపంచంలో కార్పొరేట్ దిగ్గజ సంస్ధలు. కార్పొరేట్ ప్రపంచంలో ఈ రెండు మేం గొప్ప అంటే మేం గొప్ప అంటూ పోటీకి దిగుతున్నాయి. రెండు సంస్ధలు చేసే వ్యాపారాలు వేర్వేరైనా పోటీ మాత్రం ఎక్కువగానే ఉంది. ఈ ఏడాది ప్రధమార్ధంలో గూగుల్ కు చెందిన అల్ఫాబెట్ మార్కెట్ విలువ యాపిల్ ను అధిగమించింది.

ఈ పరిణామం తర్వాత యాపిల్ సంస్ధ ఎగుడుదిగుళ్లతో ఉంది. ఈ ేడాది యాపిల్ మార్కెట్ విలువ 52,200 కోట్ల డాలర్లు ఉంది. ఇక ఆల్ఫాబెట్ మార్కెట్ విలువ 49,600 కోట్ల డాలర్లు ఉంది. గడచిన ఏడాదిలో యాపిల్ షేరు విలువ 30 శాతం మేర క్షీణించింది. కంపెనీ ఎదుగుదల రేటు తగ్గడం, ఐ ఫోన్ వల్ల వచ్చే లాభాలు పెద్దగా లేకపోవడం కంపెనీని ఆందోళన పరుస్తోంది. ఐఫోన్ విడుదలైన తర్వాత యాపిల్ కంపెనీ ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఎదిగింది.

అయితే ఆ తర్వాత మాత్రం యాపిల్ నుంచి కొత్త ఉత్పత్తులు రావడం లేదు. దీంతో సంస్ధ డీలా పడింది. ఇక గూగుల్ విషయానికి వస్తే ఈ సంస్ధ మొబైల్ ఫోన్ల సామ్రాజ్యంలో నెంబర్ వన్ గా ఎదుగుతోంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో అన్ని సెల్ ఫోన్ కంపెనీలను ఆకర్షిస్తోంది. ఇదే కాదు కొత్తగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, ఫైబర్ నెట్ వర్క్, ఇంటర్నెట్ బెలూన్న్ వంటి కొత్తవాటితో మార్కెట్ ను ముంచెత్తుతోంది. దీంతో రెండు సంస్ధల మధ్య పోరు నానాటికి పెరుగుతోంది. ఈ ఆర్ధిక సంవత్సరాంతానికి ఈ రెండు సంస్ధల్లో ఏదీ నెంబర్ వన్ గా నిలబడుతుందో వేచి చూడాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -