Sunday, April 28, 2024
- Advertisement -

మహానగరాలు పల్లేలు అవుతున్నాయా..?

- Advertisement -
News About GHMC Employees

తెలంగాణలోని మిగతా జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ అన్ని రంగంలో ముందు ఉంది. భారతదేశంలో అత్యుత్తమ జీవన ప్రమాణాలున్న సీటీగా హైదరాబాద్ కు మంచి పేరు ఉంది. ఇక్కడ అందరు జీవనం సాగిస్తున్నారు. ఉన్నావారు.. లేనివారు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా బ్రతుకుతున్నారు. హైదరాబాద్ లో పండగలు భారీ ఎత్తున జరుగుతుంటాయి.

పండగలకే సెలవలు దొరకడంతో ఇంట్లో అందరూ పండగలను పెద్ద ఎత్తున చేసుకుంటారు. అయితే మామూలుగా పండగల సందర్భంగా పల్లేల్లో ఉండే వారు సీటీకి వచ్చి ప్రతి ఇంట్లో ఎంతో కొంత డబ్బు అడుగుతుంటారు. ఇది చాలా కాలం నుంచి జరుగుతుందే. అయితే హైదరబాద్ సీటీలో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే కేవలం పల్లేల్లో నుంచి వచ్చి డబ్బు అడిగేవారు. ఇది ఇప్పుడు కాస్తా తగ్గింది. అయితే పల్లేల నుంచి వచ్చేవారు తగ్గారు అనో లేక.. తమ ఇష్టానికి కొందరు జీఎచ్ఎంసీ అధికారుల హైదరబాద్ లో డబ్బులు అడుగుతున్నారు.

వారికి ప్రభుత్వం జీతం ఇస్తుంది. అయిన ఇలా ఇంటికి వచ్చి డబ్బులు అడగటం పై కొందరు మండిపడుతున్నారు అంతేకాకుండా ఇలాంటి పని చేయడం ఏంటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. హైదరబాద్ అన్ని ప్రాంతంలో ఇలాంటి పరిస్థితి ఉంది. ఈ నగరానికి ఏం అయింది అని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకొవాలని ప్రజలు ప్రభుత్వంను కోరుతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -