Thursday, May 2, 2024
- Advertisement -

స్కూల్ పిల్ల‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌

- Advertisement -

స్కూల్ పిల్లలకు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెబుతోంది. ఆరు రోజులు స్కూల్ బ్యాగ్‌లు మోస్తూ బ‌డికి వెళ్తున్న విద్యార్థుల‌కు తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ అధికారులు ఒక‌రోజు రిలీఫ్ ఇవ్వ‌నున్నారు. కర్ణాటక రాష్ట్ర‌లో వారంలో ఒకరోజు స్కూల్ బ్యాగ్‌కు విరామం ప్రకటించి విజ‌య‌వంతంగా అమ‌లు చేస్తున్నారు. అక్కడ నో స్కూల్ బ్యాగ్ డే విధానం అమ‌లవుతోంది. ఇది ప‌రిశీలించిన తెలంగాణ ప్ర‌భుత్వం అమ‌లు చేయాల‌ని స‌న్నాహాలు చేస్తోంది.

బ్యాగుల మోతతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు… ఆ బరువుల మోతను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల‌ల్లో ప్రతి శనివారం స్కూల్ బ్యాగ్‌లకు విరామం ప్రకటించే అంశంపై కసరత్తు చేస్తున్నట్టు ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ డైరెక్టర్ జీ కిషన్. ఇప్పటికే. రాష్ట్రంలోనూ ఈ అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లతోపాటు ఇతర బోర్డుల నుంచి అఫిలియేషన్ పొందిన ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకూ.. ఇది ఉపయోగకరమని భావిస్తున్నారు.

స్కూల్ బ్యాగ్‌ల మోత బరువును శాశ్వతంగా నివారించేందుకు మరో కీలక అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ను ప్రతిరోజూ ఇంటికి తీసుకెళ్లకుండా.. పాఠశాలలోనే భద్రపరిచే విధంగా ర్యాక్‌లను ఏర్పాటుచేసే ఆలోచన కూడా ఉన్నదని కిషన్ వెల్లడించారు. అవసరమైతే ఈ విషయంపై ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి, బ్యాగ్‌ల మోత తగ్గించటంపై అందరి సహకారం కోరుతామని పేర్కొన్నారు. అయితే ఇప్పటికే కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ర్యాకులు/లాకర్లు/బీరువాల విధానం అమలుచేస్తున్నాయి. అన్ని పాఠశాలల్లో కూడా ఇలాంటి విధానం అమలుచేయటం వల్ల చిన్నపిల్లలకు స్కూల్ బ్యాగ్‌లను మోసేభారం తగ్గుతుందన్న అభిప్రాయంతో విద్యాశాఖ అధికారులున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -