Saturday, April 27, 2024
- Advertisement -

కేంద్రంపై సుప్రీం కోర్టు న్యాయమూర్తి రమణ ఆగ్రహం

- Advertisement -

దేశంలో కరువు తాండవిస్తోందని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు  మీకు చెబితే తప్ప పట్టించుకోరా అని కేంద్రంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ. రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వ్యవహరిస్తున్న వైఖరి ఎంత మాత్రం సమంజసం కాదని అన్నారు. పలు కేసుల విచారణలో భాగంగా జస్టీస్ బి.లోకూర్ తో కలిసి బెంచ్ ను పంచుకున్న న్యాయమూర్తి కేంద్ర వైఖరిని తప్పుపట్టారు.

రాష్ట్రాలు కరువును ప్రకటించకపోతే ఇక అంతేనా.. న్యాయస్ధానమో… రాష్ట్రమో అడిగితే తప్ప ఇందులో మీ పాత్ర ఉండదా అని ఆయన నిలదీసారు. దేశంలో జరుగుతున్న ఉపాధి హామి నిధులపై కూడా ఆయన కినుక వహించారు. ఉపాధి హామి నిధులను వెంటనే విడుదల చేయాలి. లేకుంట రాష్ట్రల్లో వివిధ పనులు దెబ్బతింటాయి అని ఆయన అన్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 12 రాష్ట్రాల్లో నెలకొన్న కరువుపై కేంద్రం మిన్నకుందంటూ వచ్చిన పిటీషన్లపై న్యాయమూర్తి రమణ విచారణ చేపట్టారు. కరువు బారిన పడిన రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లో పరిస్ధితిని వివరిస్తూ నివేదిక సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించారు. కరువు నివారణ కోసం బడ్జెట్ లో ఎన్ని నిధులు కేటాయించారో కూడా తెలియజేయాలని ఆయన కేంద్రాన్ని ఆదేశించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -