Thursday, May 2, 2024
- Advertisement -

సామాన్యుడిపై మరింత భారం

- Advertisement -

సామాన్యుడి నడ్డి మరోసారి విరిగనుంది. ఇప్పటికే అధిక ధరలతో బతుకీడుస్తున్న మధ‌్యతరగతి, సామాన్యులపై మరో దెబ్బ పడనుంది.  మంగళవారం అర్ధరాత్రి నుంచి పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ చమురు మార్కెట్ లో వచ్చిన భారీ మార్పుల కారణంగా పెట్రోలు, డీజీల్ ధరలు భారీగా పెరగనున్నాయి.

పెట్రోలుపై లీటర్ కు 2.72 పైసలు, డీజిల్ పై 2.46 పైసలు పెంచుతున్నారు. ఈ పెరుగుదల మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చింది. ఈ ధరల పెరుగుదల కారణంగా ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

అంతర్జాతీయంగా చమురు మార్కెట్, డాలర్ కు రూపాయి మారకం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అయిల్ కంపెనీలు చమురు ధరలను నిర్ణయిస్తాయి. ఇలా ప్రతి రెండు నెలలకొకసారి చేయడం వల్ల సామాన్యులపై భారం ఎక్కువగానే ఉంటోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -