Thursday, May 2, 2024
- Advertisement -

వాహణదారులకు షాక్‌! వ‌చ్చేనెల 14నుంచి ప్ర‌తీ ఆదివారం పెట్రోబంక్‌లు సెల‌వు

- Advertisement -
Petrol pumps to remain shut on Sundays from May 14

నిత్యావ‌స‌రాల వ‌స్తువుల‌లో పెట్రోల్‌,డీజిల్ కున్న ప్రాధాన్య‌త దేశంలో ఏనిత్యావ‌స‌ర వ‌స్తువుకులేదు.దేశ ఆర్తిక వ్య‌వ‌స్త‌కు ఇంధ‌నం మూలాధారం.ప్ర‌తీ రోజు ల‌క్ష‌ల‌కోట్ల‌లీట‌ర్ల డీజిల్‌,పెట్రోల్ ఖ‌ర్చు అవుతాయి.ప్ర‌తీ చిన్న,పెద్ద‌ విష‌యానికి ప్ర‌తీ ఒక్క‌రూ వాహ‌నాలులేనిది బ‌య‌ట‌కు రాని ప‌రిస్తితి. ఇంధ‌నం నిత్యావ‌స‌ర స‌రుకుగా మారిన నేప‌థ్య‌లో వాహ‌న‌దారులంద‌రికీ ఇప్పుడు మ‌రోషాకింగ్ వార్త‌.ఇక నుంచి ప్ర‌తీ ఆదివారం పెట్రోబంక్‌లు బంద్‌కానున్నాయి.

వ‌చ్చె నెల 14నుంచి ప్ర‌తీ ఆదివారం వారాంత‌పు పెల‌వును పాటించ‌నున్న‌ట్లు పెట్రోల్ బంక్‌ల డీల‌ర్లు ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు.డీజిల్‌,పెట్రోల్‌మీద క‌మీష‌న్ పెంచాల‌న్న డిమాండ్ ప‌రిస్కారానికి నోచుకోక‌పోవ‌డంతోనే డీల‌ర్లు వినూత్నత‌ర‌హాలోప్ర‌తీ ఆదివారం బంకులు వారాంత‌పు సెల‌వ‌ను పాటించ‌నున్నాయి.మే10న  కొనుగోళ్ల‌నిరాక‌ర‌న దినంగా పాటించ‌నున్నాయి.దీంతో బంకు డీల‌ర్లు ఎవ‌రు ఇంధ‌నాన్ని కొనుగోలు చేయ‌రు కాబ‌ట్టి త‌ర్వాత రోజుల్లో బంకుల్లో ఇంధ‌న కొర‌త‌ స‌మస్య ఏర్ప‌డ‌నుంది. పెట్రోల్ డీల‌ర్ల అసోసియేష‌న్‌కు చెందిన ర‌విషిండే మాట్లాడుతూ …గ‌డిచిన రెండురోజుల్లో దేశ వ్యాప్తంగా ఉన్న డీల‌ర్లందిరితోనూ చ‌ర్చ‌లు జ‌రిపామ‌నీ ….డీలీర్లకు ఇచ్చే క‌మీష‌న్ను పెంచుతామ‌నిఇచ్చిన హామీనీ ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర్చలేద‌న్నారు.

అపూర్వ చంద్ర క‌మిటీ నివేదిక ప్ర‌కారం క‌మీష‌న్ పెంచ‌క‌పోవ‌డంపై దేశంలోని డీల‌ర్లంద‌రూ అసంతృప్తితో ఉన్నార‌న్నారు.ప్ర‌భుత్వానికి మే 10 వ‌ర‌కు గ‌డువిస్తున్నామ‌నీ ఆలోగా స‌మ‌స్య‌ను ప‌రిస్క‌రించ‌క‌పోతో పెట్రోల్‌,డీజిల్‌ను కొనుగోలు చేయ‌బోమ‌నీ ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. ప్ర‌భుత్వంగానీ స్పందించ‌కుంటే  మే 14 నుంచి ప్ర‌తీ ఆదివారం బంకుల‌ను మూసివేయ‌నున్నారు.దీంతోపాటు మ‌రుస‌టిరోజునుంచి ఉద‌యం 9నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కే ఇంధ‌నాన్ని  విక్క‌యించ‌నున్నారు .వారిస‌మ‌స్య‌ను ప‌రిస్కరించేంత‌వ‌ర‌కు  నిర‌స‌న‌ను కొన‌సాగిస్తామ‌నీ డీల‌ర్ల  అసోసియేష‌న్ కేంద్ర ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు.ఒక వేల వారి స‌మ‌స్య‌ను ప్ర‌భుత్వం రిస్క‌రించ‌క‌పోతే ఇబ్బందులు ప‌డేది వాహ‌న‌దారులే కాబ‌ట్టి …. ఇక నుంచి వ‌చ్చేనెల 14నుంచి వాహ‌న‌దారులంద‌రూకూడా అదివారాన్ని దృష్టిలో పెట్టుకొని వాహ‌నాల్లో ఇంధ‌నాన్ని స్టాక్ పెట్టుకోవాల్సిందే. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -