Friday, May 3, 2024
- Advertisement -

బ్ర‌హ్మ‌పుత్రా న‌దిపై దేశంలోనే పొడ‌వైన బోగీబీల్ వంతెన‌ను ప్రారంభించిన మోదీ..

- Advertisement -

అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌లను కలుపుతూ బ్రహ్మపుత్రా నదిపై నిర్మించిన రోడ్డు కమ్ రైలు వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 4.94 కిలోమీటర్లతో దేశంలోనే అత్యంత పొడవైన వంతెనగా ఇది రికార్డులకెక్కింది. అసోంలోని తిన్ సుకియా.. అరుణాచల్ ప్రదేశ్ లోని నహర్ల్ గన్ పట్టణాల మధ్య దీనిని నిర్మించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ జయంతిని పురస్కరించుకుని ‘బోగీబీల్’ వంతెనను ప్రారంభించారు.

మోదీ వెంట అసోం గవర్నర్ జగదీష్ ముఖీ, సీఎం శర్వానంద సోనోవాల్ ఉన్నారు. కాగా, ఈ వంతెన నిర్మాణానికి 1997లో అప్పటి ప్రధాని హెచ్ డీ దేవెగౌడ శంకుస్థాపన చేశారు. 2002లో ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి దీని నిర్మాణపనులను ప్రారంభించారు. ఇది అసోంలోని దిబ్రూగర్ జిల్లాలో ఉన్న బ్రహ్మపుత్ర నది దక్షిణ ఒడ్డును, అరుణాచల్ ప్రదేశ్‌లోని థెమాజీ జిల్లాలోని శిలాపథార్‌తో కలుపుతోంది.

అంటే దాదాపు 20 ఏళ్లకు పైగా దీన్ని నిర్మించారు. ఇంత ఎక్కువకాలం పట్టడానికి కారణం ఇంజినీరింగ్ సమస్యల కంటే రాజకీయ అంశాలే ఎక్కువని తెలుస్తోంది. దీని నిర్మాణానికి అయిన ఖర్చు రూ.5,800 కోట్లు. దీని వల్ల అసోం నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌కు నాలుగు గంటలు, ఢిల్లీ నుంచి దిబ్రూగర్‌కి మూడు గంటలు ప్రయాణ సమయం తగ్గుతుంది

ఇదివరకు అసోంలోని తిన్సుకియా నుంచీ అరుణాచల్‌ప్రదేశ్‌లోని నహర్లాగన్ పట్టణానికి రైల్లో వెళ్లాలంటే 10 గంటలు పట్టేది. ఇప్పుడీ వంతెన వల్ల 4 గంటల్లోనే వెళ్లిపోవచ్చు. చైనా సరిహద్దు సమీపం వరకూ నిర్మించిన ఈ బ్రిడ్జి భారత రక్షణ శాఖకు చాలా ఉపయోగకరంగా ఉండనుంది. యుద్ధ ట్యాంక్‌ల కదలికకు, ఫైటర్‌ జెట్ల ల్యాండింగ్‌లను తట్టుకునేవిధంగా చాలా బలంగా బోగిబీల్‌ బ్రిడ్జి నిర్మించారు.

బోగీబీల్ బ్రిడ్జ్ ప్ర‌త్యేక‌త‌లు…
వంతెన పైభాగంలో 3 లైన్ల రహదారి ఉంది
ఈ వంతెన పొడవు 4.94 కిలోమీటర్లు
దీని నిర్మాణానికైన ఖర్చు రూ.5.920 కోట్లు
అసోంలోని తిన్ సుకియా..అరుణాచల్ ప్రదేశ్ లోని నహర్ల్ గన్ పట్టణాల మధ్య ప్రయాణ దూరం 500 నుంచి 100 కిలో మీటర్లకు తగ్గుతుంది
దాదాపు 10 గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది
రక్షణ సామాగ్రి తరలించే అత్యంత భారీ వాహనాలు దీనిపై వెళ్లొచ్చు
ఈ వంతెనపై యుద్ధ విమానాలు సైతం దిగొచ్చు
రిక్టర్ స్కేలుపై 7.0 భూకంప తీవ్రతను కూడా ఈ వంతెన తట్టుకోగలదు
ఈ బ్రిడ్జి వల్ల అరుణాచల్‌ప్రదేశ్‌తో పాటు చైనా సరిహద్దులకు రాకపోకలు సులభమవుతాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -