Friday, March 29, 2024
- Advertisement -

కరోనా గ్రామాల్లో విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి : ప్రధాని మోదీ

- Advertisement -

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మహా ప్రళయం సృష్టిస్తుంది. ఒక్క నెలలోనే మూడు లక్షల కేసులు నమోదు అయ్యాయంటే కరోనా ఉధృతి ఎంతగా ఉందో తెలుస్తుంది. నిన్న‌ 2,19,838 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య1,66,10,481 కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 2,624 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,89,544 కు పెరిగింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,38,67,997 మంది కోలుకున్నారు. దేశంలో కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలకు కరోనా విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ అధికారులను ఆదేశించారు.

పంచాయితీరాజ్ దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో మోడీ మాట్లాడారు. గత ఏడాది ఇదే సమయంలో కరోనాతో దేశ ప్రజలు పోరాడారని, నాడు కరోనా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించకుండా చూశామని ఆయన స్పష్టం చేశారు. కరోనా పట్ల ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండరాదని ఆయన పేర్కొన్నారు. అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని, బయటకు వచ్చినప్పుడు సామాజిక దూరం పాటించడంతో పాటు విధిగా మాస్కులు ధరించాలని ఆయన దేశ ప్రజలను కోరారు.

డ్రైవర్ గా మారిన హాట్ బ్యూటీ రకూల్ ప్రీత్ సింగ్!

తెలంగాణలోని అందరికీ వ్యాక్సిన్ ఫ్రీ

పీపీఈ కిట్‌ ధరించి.. మార్కెట్ లో హల్ చల్ చేసిన శృంగారతార

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -