Friday, April 26, 2024
- Advertisement -

హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద షర్మిల దీక్ష.. అనుమతించిన పోలీసులు!

- Advertisement -

తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టిన వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. తాను తెలంగాణ కోడలు అని.. ఇక్కడ ప్రజలతో తనకు ఎంతో అనుబంధం ఉందని అంటున్న విషయం తెలిసిందే. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకు వస్తానని అంటున్నారు. ఇక తెలంగాణ యువతను ఆకట్టుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇందులో భాగంగా నిరుద్యోగుల సమస్యల తరఫున పోరాటానికి దిగారు. నిరుద్యోగుల కోసం ఆమె నిరాహార దీక్షకు రెడీ అయ్యారు. రేపు ఆమె నిరాహారదీక్షను చేపట్టబోతున్నారు.

నిరాహారదీక్ష చేస్తానని ఈ నెల 9న ఖమ్మంలో జరిగిన సభలో ఆమె ప్రకటించారు. ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే నిరాహారదీక్ష చేస్తానని అప్పుడు ఆమె హెచ్చరించారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి ఆందోళనలు చేస్తామని వైఎస్ షర్మిల అన్నారు. రేపటి(ఏప్రిల్ 15) నుంచి మూడు రోజులపాటు నిరాహార దీక్షకు దిగుతున్నట్లు షర్మిల ప్రకటించారు.

ఈ నేపథ్యంలో పోలీసులు ఒక రోజు దీక్షకు మాత్రమే అనుమతిని ఇచ్చారు. హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద నిరాహారదీక్ష చేసేందుకు పోలీసులు అనుమతించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. కాగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాబోయే జయంతి జులై 8న కొత్త పార్టీని ఆవిష్కరించనున్నట్లు ఏప్రిల్ 9న ఖమ్మంలో జరిగిన సభలో వైఎస్ షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. 

తెలంగాణలో మాస్క ధరించని వారిపై పోలీసుల కొరడా

మరీ ఇంతపాపమా.. కోడలు ఉరి వేసుకుంటె.. అత్తమామలు అది చేశారు!

పంచతీర్థాలుగా చేశామని బిజెపీ కొత్త మాట..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -