Wednesday, May 1, 2024
- Advertisement -

గుర్తించిన డబ్ల్యూహెచ్‌వో

- Advertisement -

హైదరాబాద్ ను మరో శాపం పీడించనున్నదా. హైదరాబాద్ నీళ్లలో మహమ్మారి పోలియో వైరస్ దాగి ఉందా. అవుననే అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్‌వో). వెంటనే అప్రమత్తమై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేసింది. దీంతో ప్రభుత్వం ఆరోగ్య శాఖ అధికారులు, ఇతర ముఖ్యలతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసింది.

దేశవ్యాప్తంగా పోలియో నిర్మాలన జరిగిందని మూడేళ్ల క్రితమే ప్రకటించినా ఈ వార్త మాత్రం కలవరానికి గురి చేస్తోంది. ప్రతి ఏటా రెండు చిన్నారులకు టీకా వేయడం, పరిసరాల పరిశుభ్రత వంటివి పాటించినా పోలియో మహమ్మారి మళ్లీ వస్తుందా అని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోలియో నివారణకు కొత్త టీకాను కూడా కనుగొన్న శాస్త్రవేత్తలు ఈ ఏడాది నుంచి దాన్ని కూడా పిల్లలకు ఇవ్వనున్నారు.

హైదరాబాద్ లోని మురికి నీటిని వివిధ పరీక్షల నిమిత్తం ల్యాబ్ లకు పంపుతున్నారు. దీనిలో వివిధ మూలకాలను పరిశీలించిన తర్వాత మనిషిలోని రుగ్మతలు, ఇతర లక్షణాలను అంచనా వేస్తున్నారు. ఇలా చేస్తున్న క్రమంలోనే హైదరాబాద్ నీటిలో పోలియో వైరస్ ఉన్నట్లుగా గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ దీనిపై అధికారులతో సమాక్షా సమావేశం నిర్వహించారు. పరీక్షలకు పంపిన  మురికి నీటిని ఏ ప్రాంతం నుంచి, ఏ సమయంలో తీసుకువచ్చారు వంటి అంశాలను పరిశీలించాలని, అక్కడున్న వారందరికి వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -